Team India ODI Toss : అంతర్జాతీయ వన్డేల్లో టీమ్ ఇండియా చెత్త రికార్డును నమోదు చేసింది. వన్డే ఫార్మాట్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో (12 సార్లు) టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఈ రికార్డును మూటగట్టుకుంది. భారత్ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ 11 సార్లు ఓడింది. కాగా, ప్రస్తుత టోర్నీలో టాస్ ఓడడం ఇది రెండోసారి.
2023 ప్రపంచకప్ నుంచి టాస్ గెలవని భారత్
2011 మార్చి నుంచి ఆగస్టు 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11సార్లు టాస్ ఓడిపోయింది. తాజాగా ఆ రికార్డును టీమ్ఇండియా బ్రేక్ చేసింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ నుంచి టీమ్ఇండియా వరుసగా 12 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. అయితే ఈ 12 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 9 సార్లు టాస్ ఓడగా, మరో మూడు సార్లు కేఎల్ రాహుల్ టాస్ గెలవలేదు.
15నెలలుగా టాస్ గెలవని టీమ్ఇండియా
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ తర్వాత టీమ్ఇండియా సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు ఆడింది. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతడూ మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. ఆ తర్వాత శ్రీలంకతో గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో మూడు వన్డేలు ఆడిన భారత్ మూడింటిలోనూ టాస్ గెలవలేదు. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల్లోనూ టీమ్ఇండియా టాస్ గెలవలేకపోయింది. భారత్ చివరి సారిగా దాదాపు 15 నెలల క్రితం వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది.
కాగా, టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ముందుగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆడడని ప్రచారం జరిగింది. కానీ, ఫుల్ ఫిట్‌గా ఉన్న బాబర్ భారత్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు
- భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
- పాకిస్థాన్ : ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్