తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లిన కోల్​కతా- ఈడెన్​లో ముంబయిపై గ్రాండ్ విక్టరీ - IPL 2024

MI vs KKR IPL 2024: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబయి- కోల్​కతా తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో కేేకేఆర్ 18 పరుగుల తేడాతో నెగ్గింది.

Mi vs KKR IPL 2024
Mi vs KKR IPL 2024 (Source: Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 10:57 PM IST

Updated : May 12, 2024, 6:56 AM IST

MI vs KKR IPL 2024: 2024 ఐపీఎల్​ ప్లేఆఫ్స్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తొలి అడుగు వేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్​ వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడం వల్ల మ్యాచ్​ను 16 ఓవర్లకు కుదించారు. కోల్​కతా నిర్దేశిచింన 158 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, రసెల్‌, హర్షిత్ రానా తలో 2, నరైన్ 1 వికెట్ దక్కించుకున్నారు. బంతితో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కాగా, ఈ సీజన్​లో కేకేఆర్​కు ఇది 9వ విజయం.

6 ఓవర్లకు 63-0
ఛేదనలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 పరుగులు, 22) దూకుడుగా ఆడడం వల్ల ముంబయి పవర్​ప్లేలో 63 పరుగులు సాధించింది. దీంతో ముంబయి సునాయసంగా గెలుస్తుందనిపించింది. కానీ, తర్వాత ఓవర్లో ఇషాన్ ఔటయ్యాడు. దీంతో ముంబయి ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుసగా రోహిత్ శర్మ (19), సూర్యకుమార్ యాదవ్ (11), హార్దిక్ పాండ్య (2), టిమ్ డేవిడ్ (0), నిహాల్ వధేరా (3), నమన్ ధీర్ (17), తిలక్ వర్మ (32) పెవిలియన్​కు క్యూ కట్టారు. దీంతో ముంబయి ఓటమి ఖాయమైంది. కాగా, ఈ సీజన్​లో ముంబయికిది 9వ ఓటమి.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (6 పరుగులు), సునీన్ నరైన్ (0) విఫలమయ్యారు.వెంకటేశ్ అయ్యర్ (42 పరుగులు, 23 బంతుల్లో), నితీశ్ రానా (33 పరుగులు, 23 బంతుల్లో), ఆండ్రీ రస్సెల్ (24 పరుగులు, 14 బంతుల్లో), రింకూ సింగ్ (20 పరుగులు, 12 బంతుల్లో), రమన్​దీప్ సింగ్ (17*) రాణించారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, పీయుశ్ చావ్లా చెరో 2, నువాన్ తుషారా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ వికెట్ దక్కించుకున్నారు.

బుమ్రా రాక్- నరైన్ షాక్- ఇదేం యార్కర్ రా బాబు! - IPL 2024

దిల్లీ ఫ్యాన్స్​కు షాక్- పంత్​పై ఓ మ్యాచ్ నిషేధం - IPL 2024

Last Updated : May 12, 2024, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details