ETV Bharat / state

న్యాయవాదికి అనుమతి నిరాకరణ - ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగిన కేటీఆర్ - KTR REACHED TO ACB OFFICE

కేటీఆర్‌ న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ - వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు - దీంతో ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగిన కేటీఆర్.

KTR Reached To Acb office
KTR Reached To Acb office (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 10:58 AM IST

Updated : Jan 6, 2025, 2:25 PM IST

KTR Returned From ACB office : ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడారు. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. తనను ఏసీబీ అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందని అన్నారు. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

KTR Returned From ACB office (ETV Bharat)

న్యాయవాదిని తీసుకెళ్లడం నా హక్కు : తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని, న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసిందని తెలిపారు. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్‌కు వచ్చానని, తన లాయర్‌ను తనతో రావొద్దని చెబుతున్నారన్నారు. పోలీసులను నమ్మనని తెలిపారు. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కు అని వివరించారు. తాను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నానని, అయినా ఇంతమంది పోలీసులెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలని, పోలీసులు ఎందుకు చెబుతున్నారని మండిపడ్డారు.

"హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలుగా వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి, సాధించేదేమీ లేదు. రైతు భరోసా ఎగ్గొట్టారు. దాని నుంచి దారి మళ్లించేందుకు ఈ నాటకాలు. ఇలాంటి నాటకాలకు భయపడం, బాధపడం. నేను ఇక్కడికి రాగానే మా ఇంటిపై దాడులు చేయిస్తారన్న సమాచారం ఉంది. కేసులు ఎన్నిపెట్టినా భయపడను. నాతో పాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టమేంటి?."-కేటీఆర్, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగిన కేటీఆర్ : తన తరపు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్‌ వెనుదిరిగారు. అనంతరం ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నోటీసులపై స్పందించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు బయలుదేరి వెళ్లారు. దీంతో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు సమాచారం.

కేటీఆర్​ వస్తాడా? రాడా? - ACB విచారణపై తీవ్ర సందిగ్దత

“జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించింది : కేటీఆర్

Last Updated : Jan 6, 2025, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.