ETV Bharat / sports

'వాళ్లకు చెప్పడానికి మేం ఎవరం? మాకు క్రికెట్ గురించి తెలీదు'- టీమ్ఇండియాపై గావస్కర్ సెటైర్ - SUNIL GAVASKAR ON TEAM INDIA

టీమ్ఇండియాపై గావస్కర్ ఫైర్- ఆటగాళ్లకు పరోక్షంగా చురకలు!

Sunil Gavaskar
Sunil Gavaskar (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 5, 2025, 5:05 PM IST

Sunil Gavaskar On Team India 2024 : బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3- 1 తేడాతో దక్కించుకుంది. దీంతో ఆసీస్ 10ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. ఈ సిరీస్​లో భారత్​కు ఆయా మ్యాచ్​ల్లో పలు అవకాశాలు వచ్చినా, సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేసింది. అయితే టీమ్ఇండియా పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. సిడ్నీ టెస్టు అనంతరం మ్యాచ్ ప్రజెంటేటర్​తో మాట్లాడిన గావస్కర్ టీమ్ఇండియా ఆటగాళ్లపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్​తో సిరీస్ అఫీషియల్ బ్రాడ్​కాస్టర్ స్టార్ స్పోర్ట్స్​ చిట్​చాట్​లో సన్నీ మాట్లాడాడు. 'ఈ క్రమంలో భారత్ ప్రదర్శన మెరుగుపడాలంటే ఏం చేయాలి?' అని ప్రజెంటేటర్ సన్నీని అడిగాడు. దీనికి సన్నీ 'అది చెప్పడానికి మనం ఎవరం? మనకు క్రికెట్ గురించి తెలియదు. మనం కేవలం టీవీల్లో మాట్లాడి డబ్బులు సంపాదిస్తాం కదా. మా మాట వినకండి. ఒక చెవితో విని, మరో చెవి నుంచి వదిలేయండి' అని పేర్కొన్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. భారత జట్టు నిర్మాణంలో సీనియర్ల పాత్ర ఉంటే బాగుంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్​లో చెబుతున్నారు.

నన్ను పిలిచి ఉంటే బాగుండు
సిరీస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్​కు గావస్కర్‌ను పిలవకుండానే బోర్డర్‌ చేతుల మీదుగా ప్రదానం చేయించడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. కెప్టెన్ కమిన్స్​కు​ ట్రోఫీ ఇస్తున్న సమయంలో గావస్కర్ అక్కడే మైదానంలో కామెంటరీ చేస్తుండడం గమనార్హం. దీనిపై గావస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'నేను ఇక్కడే ఉన్నా. ఆసీస్​ సిరీస్‌ నెగ్గింది. అదేమీ నాకు ఇబ్బందికరం కాదు. వాళ్లు బాగా ఆడి, విజయం సాధించారు. కానీ, ట్రోఫీని బోర్డర్‌తో కలిసి నేను కూడా అందిస్తే బాగుండేది. అయితే నేను కేవలం భారతీయుడిననే నన్ను పిలవలేదేమో. ఈ మ్యాచ్​కు ముందే నిర్వాహకులు నాకు ఓ విషయం చెప్పారు. ఈ టెస్టు డ్రా గా ముగిసినా, భారత్ ఓడినా నేను అవసరం లేదన్నారు. నాకేం బాధ లేదు. కానీ, ఇది బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కదా మేమిద్దరం కలిసి ఇస్తే బాగుంటుందని అనిపించింది' అని సన్నీ తెలిపాడు.

10 ఏళ్ల తర్వాత భారత్​కు ఘోర పరాజయం - గావస్కర్ ట్రోఫీ ఆసీస్​దే

అప్పుడు అదే రైట్, ఇప్పుడు ఇదే కరెక్ట్- వివాదస్పదంగా థర్డ్ అంపైర్ నిర్ణయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.