Travis Head On Bumrah : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా ప్రదర్శన అసాధారణం అని కొనియాడాడు. తన టెస్టు కెరీర్‌లో చూసిన అత్యుత్తమ ప్రదర్శన బుమ్రాదేనని అభినందించాడు. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బరిలోకి దిగడం లేదని తెలిసి సంతోషించినట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత హెడ్ బుమ్రా గురించి మాట్లాడాడు.
'బుమ్రాకు ఇది అసాధారణ సిరీస్‌గా మిగిలిపోతుంది. నా టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బుమ్రాదే. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బౌలింగ్ చేయడం లేదని తెలియగానే, మా డ్రెస్సింగ్ రూమ్ అంతా ఆనందంతో నిండిపోయింది. అతడు మా జట్టులోని 15 మంది ప్లేయర్లను బుమ్రా తన బౌలింగ్‌తో భయపెట్టాడు. నేను గత రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమవడం వల్ల తీవ్ర నిరాశకు గురయ్యా'
'ఆఖరి మ్యాచ్‌లో టార్గెట్ చిన్నదిగా ఉండడం వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాం. సరైన మూమెంట్ వేచి చూశాం. తలా 20, 30 పరుగులు చేసినా గెలవచ్చని భావించాం. ఉస్మాన్ ఖవాజాతో చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేశా, అదే లయను వెబ్‌స్టర్‌తో కొనసాగించాను. యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. నితీశ్ కుమార్ టాలెంట్ నాకు తెలుసు' అని హెడ్ పేర్కొన్నాడు.
“There were 15 men who were the most pleased with Jasprit Bumrah not present in the bowling.”
— Cricketopia (@CricketopiaCom) January 5, 2025
Travis Head
pic.twitter.com/BVSoWEtLr0
బుమ్రా అదుర్స్
కాగా, ఈ సిరీస్‌లో బుమ్రా అత్యుత్తమంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా 32 వికెట్లు నేలకూల్చి, సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడిని 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు వరించింది. ఇక సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా, వెన్నునొప్పి కారణంగా ఆట మధ్యలో మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు. దీంతో 162 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఈజీగా ఛేదించింది. మరోవైపు బ్యాటింగ్‌లో హెడ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 55 సగటుతో 448 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా - ఆ స్పిన్ దిగ్గజం తర్వాత మనోడిదే ఘనత!
'మొదట్లో తప్పు అన్నారు- కానీ, అదే అతడి బలం'- ఈటీవీ భారత్‌తో బుమ్రా కోచ్