Bumrah Childhood Coach With ETV Bharat : టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవాలంటే అంత అషామాషీ కాదు. బుమ్రా సంధించే బంతులు ఎదుర్కొనేందుకు దిగ్గజ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడుతుంటారు. 2016లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన బుమ్రా అనతికాలంలో టీమ్ఇండియాకు కీలక ప్లేయర్‌గా మారాడు.
తాజాగా ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ బుమ్రా అదరగొట్టాడు. 5 టెస్టుల్లో ఏకంగా 32 వికెట్లు తీశాడు. దీంతో అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. ఈ క్రమంలో ఈటీవీ భారత్ తో బుమ్రా చిన్ననాటి కోచ్ కిశోర్ త్రివేది ముచ్చటించారు. అతడి బౌలింగ్ యాక్షన్, బాల్యం గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా బ్యాటర్లు అతడు సంధించే బాంతులు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారని త్రివేది వ్యాఖ్యానించారు. బుమ్రా బౌలింగ్‌లోని వైవిధ్యమే అతడి బలమని, అదే వికెట్లు తీయడానికి దోహదపడుతోందని పేర్కొన్నారు. బుమ్రా ప్రస్తుతం పలు వేరియేషన్స్‌తో బౌలింగ్ వేస్తున్నాడని, ఇంతకుముందు యార్కర్లపై ఎక్కువగా దృష్టి పెట్టాడని తెలిపారు.
బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు!
'బుమ్రా బౌలింగ్‌లో వేరియేషన్స్ వల్ల అతడికి ఎక్కువ వికెట్లు దక్కుతున్నాయి. అకాడమీలోని కొందరు పిల్లలు బుమ్రా బౌలింగ్ యాక్షన్‌పై మొదట్లో సందేహాలు లేవనెత్తారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ లో ఏదో తప్పు ఉందని చెప్పారు. అప్పుడు నేను మొదటి 2- 3 రోజులు బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చూశాను. అప్పుడు బుమ్రా బౌలింగ్ యాక్షన్ సరైనదేనని చెప్పాను. బుమ్రా చాలా స్పీడ్‌గా బంతులు వేస్తాడు. అందుకే కొందరు దానిని త్రోగా భావిస్తారు'
--- త్రివేది, బుమ్రా చిన్ననాటి కోచ్
'చదువు దృష్టిలేదు- అంతా ఆటపైనే'
'తమ కుమారుడు చదువుపై దృష్టి పెట్టడం లేదని, క్రికెట్ ఆడేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నాడని బుమ్రా తల్లి నాతో చెప్పింది. బుమ్రాను తన వద్ద రెండేళ్లు శిక్షణకు పంపించమని ఆమెను కోరాను. నా అకాడమీలో చేరిన తర్వాత బుమ్రా స్థానిక టోర్నమెంట్లో ఆడాడు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో ఫాస్ట్ బౌలర్‌గా పాపులర్ అయ్యాడు. అయితే అప్పటికి బుమ్రా లైన్ అండ్ లెంగ్త్ బాంతులు వేయడంలో ఇబ్బంది పడేవాడు. యార్కర్ల వేయడంలో మాత్రం దిట్ట' అని బుమ్రా చిన్ననాటి జ్ఞాపకాలను త్రివేది ఈటీవీ భారత్‌తో షేర్ చేసుకున్నారు.
అలాగే బుమ్రా కెప్టెన్సీపై కూడా త్రివేది స్పందించారు. బుమ్రా బౌలర్లను రొటేట్ చేస్తున్నప్పుడు వారిపై విశ్వాసం ఉంచుతాడని తెలిపారు. అలాగే తన కెప్టెన్సీలో బౌలర్లకు మద్దతుగా నిలుస్తాడని పేర్కొన్నారు. స్పిన్నర్, పేసర్కైనా బుమ్రా అండగా ఉంటాడని వెల్లడించారు.
Jasprit Bumrah - Player of the series of BGT 2024-25.
— Total Cricket (@TotalCricket18) January 5, 2025
Here's all 32 wickets of him in this series. The GOAT @Jaspritbumrah93 🐐pic.twitter.com/gujCDWcB7T
టీమ్ డాక్టర్‌తో మైదానం వీడిన బుమ్రా - గాయం వల్లేనా?
46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా - ఆ స్పిన్ దిగ్గజం తర్వాత మనోడిదే ఘనత!