CM Revanth Reddy at Korutla Jana Jathara Sabha: దేశంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల ఎత్తివేతతో బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రావని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై గొంతెత్తి ప్రశ్నించినందుకు తనపై పగబట్టి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రే కేసు పెట్టారని పేర్కొన్నారు.
'పదేళ్ల మోదీ పాలన'లో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 'పెద్ద గాడిద గుడ్డు' : సీఎం రేవంత్ ట్వీట్ - CM REVANTH TWEET ON NDA GOVT
జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వసం జరిగిందని ఆయన విమర్శించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రతినిధులు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కలిసి కులగణన చేయాలని కోరారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
CM Revanth May Day Wishes 2024: తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ మొదట రాష్ట్రంలోని కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు.సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మిక సంఘాలు సకలజనుల సమ్మె చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికలకు గత ఎన్నికల కంటే భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
CM Revanth Slams BJP Over Reservations :రిజర్వేషన్ల రద్దుపై తాను ప్రశ్నించినందుకు, బీజేపీ నేతలు ఈడీ ఐటీ సీబీఐతోనే కాకుండా దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కమలం నేతల వద్ద సీబీఐ ఈడీ పోలీసులు ఉండొచ్చు కానీ, తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. ముక్త్ భారత్ అంటే జర్వేషన్లు రద్దు చేయడమేనా? అని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల అమలులో బీజేపీ నేతలు తెలంగాణను అవమానించి, మళ్లీ ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
"ఈ ఎలక్షన్లో 400 ఎంపీ సీట్లు గెలవాలని, దేశాన్ని అమ్మేయాలని బీజేపీ చూస్తోంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్యంసం జరిగింది. ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని చూస్తే కమలం పార్టీ అడ్డుకుంటుంది. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నాయి. రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే నాపై దేశ హోం మంత్రే కేసు పెట్టారు". - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే నాపై పగబట్టి కేసులు పెట్టారు : సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా మే డే వేడుకలు - ప్రజాపాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్న సీఎం రేవంత్ - MAY DAY CELEBRATIONS in ts 2024
బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Road Show at Hyderabad