ETV Bharat / politics

ప్రధానమంత్రితో రాష్ట్ర బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ - అందరూ కలిసి అలా చేయాలని చెప్పిన మోదీ - TELANGANA BJP MPS MLAS MEET PM MODI

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు - నాయకులు అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించినట్లు సమాచారం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 7:34 PM IST

Updated : Nov 27, 2024, 9:34 PM IST

Telangana BJP MPS MLAs Meet PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి దిల్లీ వెళ్లిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇవాళ దిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధానిని కలిశారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల యోగక్షేమాలను ప్రధాని అడిగినట్లు సమాచారం. కలిసి మెలిసి పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. 2028లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే సమన్వయంతో కష్టపడి పని చేయాలని చెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఫొటోలతో ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్​లో తెలుగులో పోస్టు పెట్టారు.

" తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం చాలా బాగా జరిగింది. ఆ రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ వాసులు ఇప్పటికే కాంగ్రెస్​తో విసిగిపోయారు. బీఆర్ఎస్ దుష్టపాలనవల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటారు" - ప్రధాని మోదీ ట్వీట్

Last Updated : Nov 27, 2024, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.