ETV Bharat / state

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును సడెన్​గా నిలిపివేసిన డ్రైవర్ - ఏమైందంటే?

పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నిలిపివేత - వెల్గటూర్ నుంచి కరీంనగర్ వెళ్తున్న బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు - అసహనానికి గురై బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్

RTC Bus Was Stopped Due To Overload
RTC Bus Was Stopped Due To Overload (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

RTC Bus Was Stopped Due To Overload : రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దఎత్తున ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోకి ఎక్కడంతో సిబ్బందికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో రద్దీ ఏర్పడి, ఇబ్బందిపడ్డ డ్రైవర్ ఆర్టీసీ బస్సును నిలిపివేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వెల్గటూర్ నుంచి కరీంనగర్ వైపుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెల్గటూరు మండల కేంద్రంలో బయలుదేరిన బస్సు అప్పటికే ప్రయాణికులతో నిండిపోయి ఉంది. పరిమితికి మించి బస్సులోకి ప్రయాణికులు ఎక్కడంతో పాటు ఫుట్​బోర్డు దగ్గర వరకు విపరీతమైన రద్దీ ఉండటంతో అసహనానికి గురైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశారు. ఫుట్​బోర్డు దగ్గర ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్న వారికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ పరిస్థితిని అర్థం చేసకున్న ప్రయాణికులు దిగడంతో ఆయన బస్సును ముందుకు పోనిచ్చారు. 10 నిమిషాలు ఆగితే ఇంకొక బస్సు వస్తుందని, ఈ విధంగా కిక్కిరిసి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఏదైనా జరిగితే తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని వాపోయారు.

ఓవర్​లోడ్​తో బస్సు నిలిపివేసిన డ్రైవర్ : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో జరిగింది. 55 మంది ప్రయణికులు ఉండాల్సిన బస్సులో 110 మందికి పైగా ఎక్కడంతో నారాయణ అనే ఆర్టీసీ వాహన చోదకుడు బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు అధికంగా బస్సు ఎక్కుతుండటంతో ఓవర్​లోడ్​తో వెళ్లలేనని అతడు తెలిపాడు. కనీసం వెనుక నుంచి వచ్చే వాహనాలను చూసేందుకు ఏర్పాటు చేసిన సైడ్ మిర్రర్ కూడా కనిపించడం లేదని వివరించాడు. సైడ్ మిర్రర్ కనిపించక ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దయచేసి కొంతమంది బస్సు దిగాలని డ్రైవర్ కోరడంతో కొంతమంది బస్సు దిగారు. దీంతో బస్సును మళ్లీ స్టార్ట్ చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? - లిమిట్​కు మించి ఎక్కారని బస్సు ఆపేసిన డ్రైవర్ - RTC BUS STOPPED DUE TO OVER LOAD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.