Ram Charan Game Changer 3rd Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 2025 సంక్రాంతికి రానుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'నానా హైరానా' అంటూ సాగే ఈ పాటను కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడారు. తమన్ బాణీలు అందించిన ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాన్ని అందించారు.
ఫస్ట్ రెండు సాంగ్స్ కూడా!
ఇదిలా ఉండగా, ఈ సినిమాలోని మిగతా రెండు సాంగ్స్ కూడా యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'రా మచ్చా' సాంగ్‌లో చెర్రీ డ్రెస్సింగ్ స్టైల్, హుక్ స్టెప్‌ను ఫాలో అవుతూ ఎంతో మంది నెట్టింట రీల్స్ చేశారు. అంతగా పాపులర్ అయ్యింది ఆ సాంగ్. వైజాగ్‌లో భారీ సెటప్‌తో ఫుల్ కలర్ఫుల్గా సాంగ్ షూట్ చేశారు. దానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ కూడా బాగా ఆకట్టుకుంది.
చెర్రీ డ్యూయెల్ రోల్
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్టూడింట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన చరణ్ విలన్‌లను ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మరో పాత్రలో చెర్రీ ఓ రైతు నాయకుడిగా కనిపించనున్నారు. మొత్తంగా ఈ సినిమా టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో పవర్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం వల్ల అభిమానులు బాగా థ్రిల్ అవుతున్నారు.
ఇక ఈ మూవీలో చరణ్‌తో పాటు అంజలీ, యస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
చెర్రీ కోసం షారుక్ ఖాన్! - 'గేమ్ ఛేంజర్' మేకర్స్ భారీ ప్లాన్!