Abhishek Sharma vs Hyderabad : సన్‌రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్, హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ (137 పరుగులు; 105 బంతుల్లో 20x4, 3x6) శతకంతో చెలరేగగా, అభిషేక్ (93 పరుగులు; 72 బంతుల్లో 7x4, 6x6) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు . వీరి విధ్యంసంతో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది.
ఇక భారీ లక్ష్య ఛేదనలో దిగిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. కె నితీశ్ రెడ్డి (111 పరుగులు, 87 బంతుల్లో) సెంచరీ, తనయ్ త్యాగరాజన్ (74 పరుగులు, 42 బంతుల్లో) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ తిలక్ వర్మ (28 పరుగులు) నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, రఘు శర్మ 3, సన్వీర్ సింగ్, అభిషేక్ శర్మ, నమన్ ధిర్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు
- తాజా సెంచరీ ప్రభ్‌సిమ్రన్‌కు ఈ సీజన్‌లో వరుసగా ఇది మూడోది. అతడు ఇదివరకు ముంబయిపై (150 పరుగులు*), సౌరాష్ట్రపై (125 పరుగులు) సెంచరీలు బాదాడు
- విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో రెండు సార్లు 400 పైచిలుకు స్కోరు చేసిన తొలి జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది
కాగా, 24 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ ఐపీఎల్‌లోనూ పంజాబ్‌కే ఆడాడు. గత రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శన చేసి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. 2023 సీజన్‌లో ఓ శతకం కూడా బాదాడు. దీంతో 2025 ఐపీఎల్ కోసం పంజాబ్ అతడిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అభిషేక్‌ను రిటైన్ చేసుకుంది. రూ.14 కోట్ల భారీ ధరకు SRH అభిషేక్‌ను జట్టులో కొనసాగించింది.