ETV Bharat / technology

ఆల్​టైమ్ రికార్డ్ బ్రేక్​ చేసిన రాయల్ ఎన్​ఫీల్డ్- ఈసారి ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయో తెలుసా? - ROYAL ENFIELD BIKES SALES REPORT

రాయల్​ ఎన్​ఫీల్డ్ అమ్మకాల జోరు- ఏకంగా 8.5 లక్షల యూనిట్ల సేల్స్​తో రికార్డ్!

Royal Enfield Bikes Sales Report
Royal Enfield Bikes Sales Report (Photo Credit- Royal Enfield)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 5, 2025, 7:19 PM IST

Royal Enfield Bikes Sales Report: రాయల్ ఎన్​ఫీల్డ్ బైకులకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లకు మన దేశంలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఈ బ్రిటిష్ వాహన తయారీ సంస్థ 2024లో భారత్​లో అత్యధిక సేల్స్ రాబట్టింది. గతేడాది హైయెస్ట్ బైక్స్ విక్రయించి మునుపటి సేల్స్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గతేడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,57,378 యూనిట్లను విక్రయించింది. 2023లో విక్రయించిన బైక్‌ల కంటే ఇది 4 శాతం ఎక్కువ. 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,22,295 యూనిట్లు అమ్ముడయ్యాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ అత్యధిక సేల్స్: రాయల్ ఎన్​ఫీల్డ్​ బైక్స్​లో '350cc' మోడల్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. SIAM ఇండస్ట్రీ డేటా ప్రకారం.. కంపెనీ 2024 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో 5,25,568 యూనిట్లను విక్రయించింది. ఇది ఏప్రిల్-నవంబర్ 2023లో విక్రయించిన వాహనాల కంటే 0.05 శాతం ఎక్కువ. ఈ సెగ్మెంట్​లో 'బుల్లెట్ 350', 'క్లాసిక్ 350' వంటి బైక్‌లు ఉన్నాయి.

బజాజ్ కంటే వెనుకబడి ఉన్న రాయల్ ఎన్​ఫీల్డ్: రాయల్ ఎన్​ఫీల్డ్ '350-500cc' సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇందులో 'గెరిల్లా 450', 'హిమాలయన్ అడ్వెంచర్' వంటి మోడల్ బైక్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్​లో రాయల్ ఎన్​ఫీల్డ్ మొత్తం 27,420 యూనిట్లను విక్రయించింది. అయితే ఈ విభాగంలో బజాజ్ ఆటో మొత్తం మార్కెట్‌లో ముందుంది. బజాజ్ ఈ సెగ్మెంట్లో 44,491 యూనిట్ల సేల్స్​ను అందుకుంది. ఇది మొత్తం మార్కెట్ వాటాలో 51 శాతం. ఈ విభాగంలో బజాజ్ 56 శాతం వృద్ధిని సాధించింది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ 500-800cc సెగ్మెంట్ విషయానికి వస్తే.. ఈ విభాగంలో 47 శాతం పెరిగి 33,152 యూనిట్లకు చేరుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సేల్స్: గత 12 ఏళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాల నివేదికను పరిశీలిస్తే.. 2024 క్యాలెండర్ ఇయర్​ కంపెనీ 8 లక్షల యూనిట్ల విక్రయాలను అందుకున్న మూడో సంవత్సరం. అయితే ప్రస్తుతం కంపెనీ రికార్డు స్థాయిలో 8,57,378 యూనిట్లను విక్రయించి 2018 అత్యుత్తమ సేల్స్ గణాంకాలను కూడా అధిగమించింది. CY2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,57,378 యూనిట్లను విక్రయించింది. CY2018లో 8,37,669 యూనిట్లు అమ్ముడయ్యాయి.

సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత

శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాపై భారీ డిస్కౌంట్- ఏకంగా సగానికి తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా!

అదిరే ఫీచర్లు, ఆకట్టుకునే రంగులతో.. ఏథర్ 450 నయా వెర్షన్- ధర ఎంతంటే?

పవర్​ఫుల్ ప్రాసెసర్, కిర్రాక్ ఫీచర్లతో 'రెడ్​మీ టర్బో 4'- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.