ETV Bharat / state

ప్రభుత్వ భూముల కబ్జాదారులకు హెచ్చరిక! - బోర్డులు పాతేసి మావే అంటే కుదరదిక!! - GOVT LANDS ENCROACH

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న వారికి హెచ్చరిక - కొత్త విధానం తీసుకొచ్చిన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు - ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు

Hyderabad Real Estate
Hyderabad Real Estate (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 9:16 AM IST

Hyderabad Real Estate : హైదరాబాద్‌, దానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని భూములపై అక్రమార్కులు తమ మాయాజాలాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను కబ్జాదారులు తమవే అంటూ తప్పుడు పత్రాలను సృష్టించి అధికారులను, ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ఆ భూముల విషయంలో కోర్టుల వరకు వెళ్లాల్సిన పని వస్తోంది. కోర్టులో ప్రభుత్వం తగిన ఆధారాలు చూపితే సరే లేకపోతే ఆ భూములు అక్రమదారులు కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ భూమి రానురానూ ఖాళీ అవుతుండగా, ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. ఈ సమస్యను గుర్తించిన రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌).

ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల వివరాలు, వాటిపై ఉన్న వివాదాలను తెలుసుకుని జిల్లా ట్రైబ్యునల్‌ కోర్టు, హైకోర్టుల్లో ఎప్పటికప్పుడు సరైన వాదనలను వినిపించేందుకు ఈ-కోర్టు-యూఎల్‌సీ ఆర్‌ఆర్‌ పోర్టల్‌ను ఈ జిల్లా రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం ద్వారానే గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వంటి ప్రాంతాల్లో వందల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వీటిపై కన్నేసిన ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులను ఆశ్రయించగా, వారు సమర్పించిన పత్రాలు నకిలీవని నిర్ధారించేందుకు ఈ-కోర్టు పోర్టల్‌ న్యాయస్థానాలకు సరైన ఆధారాలు, పత్రాలను సమర్పించనున్నారు.

ఇక అన్ని వివరాలు ఆన్‌లైన్‌లోనే : ఈ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వానికి దాఖలు పడిన భూములు వివరాలన్నింటినీ కంప్యూటరీకరించారు. ఆయా సర్వే నంబర్లలో భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయా లేదా ఎవరైనా కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారా అని ప్రశ్నించుకుంటుంది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి ఎవరు వాదనలు వినిపించారు? తదుపరి వాయిదాలు ఎప్పుడున్నాయి? అన్న వివరాలన్నీ ఒక్క క్లిక్‌తోనే తెలిసిపోనున్నాయి. ఈ పోర్టల్‌ను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, తహశీల్దార్‌, ఆర్డీవో ఏకకాలంలో చూసేందుకు అవకాశం కూడా ఉంది. ఇక ఈ పోర్టల్‌ను అధికారులు తెరవగానే తదుపరి విచారణలు ఫలానా రోజున ఉన్నాయంటూ మెసేజ్‌లు వారిని అప్రమత్తం చేయనున్నాయి.

అన్ని ఆధారాలు ఉన్నాయి : పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్న భూములను రక్షించేందుకు ఈ-కోర్టు పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రంగారెడ్డి కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. కోర్టుల్లో ఫిర్యాదులు, విచారణల సందర్భంగా రికార్డులను సరిచూసుకునే వాళ్లమని చెప్పారు. కొత్త విధానంలో భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. ప్రస్తుతం 530 ఎకరాల భూములపై కోర్టుల్లో వివాదాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ భూములన్నీ ప్రభుత్వానివేనని రుజువు చేసే ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని రంగారెడ్డి కలెక్టర్‌ స్పష్టం చేశారు.

'స్వామి భూమినీ వదల్లేదు' : దేవుడి భూమిని స్వాహా చేసి వెంచర్లు

కబ్బాకోరల్లో ప్రభుత్వ అడ్డా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.