Marco Movie Collections : మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించిన సినిమా 'మార్కో'. ఫుల్ యాక్షన్ జానర్లో దర్శకుడు హనీఫ్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 20న మలయాళంలో రిలీజై మంచి విజయం దక్కించుకుంది. తర్వాత నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, జనవరి 3న తమిళ్లోనూ రిలీజ్ అయ్యింది.
ఫుల్ వైలెంట్ యాక్షన్‌తో ఉన్న ఈ సినిమాకు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మార్కో జోరు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. 15 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ. 100కోట్ల కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో మలయాళంలో రూ.100 కోట్లు వసూల్ చేసిన అతి కొద్ది సినిమాల్లో మార్కో కూడా చేరిపోయింది.
M🅰️RCO Storms into 1️⃣0️⃣0️⃣CR Club Worldwide🌍#Marco #running #successfully #blockbuster #incinemasnow pic.twitter.com/YqtqvOOPfM
— Unni Mukundan (@Iamunnimukundan) January 5, 2025
కాగా, ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించగా, అభిమన్యూ ఎస్, ఇషాన్ షౌలాత్, కబీర్ సింగ్, సిద్ధిఖీ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిచగా, క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.