CM Revanth Reddy, Bhatti Congratulated To Priyanka : వయనాడ్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమర్క మర్యాదపూర్వకంగా ఆమెను స్వయంగా కలిసి అభినందించారు.
హస్తిన పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రోజంతా బిజీబిజీగా గడిపారు. తొలుత పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో వరంగల్‌తోపాటు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. వరంగల్‌లో వెంటనే విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడతామని రేవంత్‌రెడ్డితో సమావేశం తర్వాత రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ : పెద్దపల్లి, భద్రాద్రిలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణశాఖ పరిధిలో ఉండటంవల్ల, ఆ శాఖ నుంచి అనుమతి ఉండాలన్నారు. ఆదిలాబాద్‌కు దగ్గరలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఉన్నాయన్న ఆయన, సమీపంలో విమానాశ్రయం లేనందున అక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎంవో అధికారి శేషాద్రి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు. హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లయినా దిల్లీకి వస్తారని రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు. పదేళ్లలో కేంద్రం నుంచి నిధులు సాధించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
అదానీకి షాక్ - రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం
'కేసీఆర్ అసెంబ్లీకి రావాలి - 80 వేల పుస్తకాల్లో ఏం చదివావో మాట్లాడుదాం'