ETV Bharat / health

'రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు'- బ్రేక్​ఫాస్ట్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - BREAKFAST BENEFITS FOR THE BODY

-బ్రేక్​ఫాస్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు -ఇవి తెలిస్తే క్రమం తప్పకుండా తింటారట!

breakfast benefits for the body
breakfast benefits for the body (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Feb 3, 2025, 9:53 AM IST

Breakfast Benefits for the Body: మనలో చాలా మంది ఉదయాన్నే వివిధ కారణాల వల్ల బ్రేక్​ఫాస్ట్ మానేస్తుంటారు. కొందరు సమయం సరిపోక, మరికొందరు ఆకలిలేక, బరువు పెరుగుతామని, ఏం తినాలో తేల్చుకోలేక, అలవాటులేక తినడం మానేస్తారు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌తో కలిగే లాభాల్ని తెలుసుకుంటే కచ్చితంగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • బ్రేక్‌ఫాస్ట్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని.. ముఖ్యంగా బరువు తగ్గడం లేదా అదుపులో ఉంటుందని వివరిస్తున్నారు. 2019లో Obesity Research & Clinical Practice ప్రచురితమైన "The effects of breakfast on weight management: A systematic review" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇంకా భిన్నమైన పోషకాలు అందడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ఆందోళనను పరిష్కరించి.. జీవితకాలాన్ని పెంచుతుందని వెల్లడిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
  • బ్రేక్‌ఫాస్ట్‌లో తగిన మొత్తంలో ప్రొటీన్లు, ఫైబర్, కొవ్వులు ఉంటే అది శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని స్థిరీకరిస్తుందని అంటున్నారు. ఇంకా శక్తిని ఇవ్వడమే కాకుండా, తిన్నామన్న భావనతో ఆరోజు ఆహారాన్ని మితంగా తీసుకునేలా చేస్తుందని వివరిస్తున్నారు.
  • ఇంకా రాత్రి నిద్రకుముందు ఏదైనా తినుంటే కొందరిలో ఉదయానికీ జీర్ణం కాకపోవడంతో బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తారు. అయితే, తర్వాత ఆకలైతే ఒకేసారి ఎక్కువ మోతాదులో తినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా మీ జీర్ణవ్యవస్థమీద ఒత్తిడి ఎక్కువవుతుందని వివరిస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఎక్కువ పనిచెబితే.. నిద్రలేమి, బరువు పెరగడంలాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
  • బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోమంటూ శరీరం మనకు చాలా సంకేతాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనం తర్వాత గ్యాప్‌ కూడా ఎక్కువగా ఉండటంవల్ల ఆకలి అనిపిస్తుందని తెలిపారు. అలాగే కొన్ని నెలలూ, సంవత్సరాలు తినకుండా ఉంటే, శరీరం దానికీ అలవాటుపడిపోతుందని చెబుతున్నారు. అందుకే 21రోజులు అలవాటు చేసుకుంటే మళ్లీ శరీరం స్పందించే తీరు సాధారణం అవుతుందని వివరిస్తున్నారు.
  • మనం ఉదయాన్నే తాగే టీ, కాఫీలు ఆకలిని తగ్గిస్తాయని చెబుతున్నారు. అవి కాస్త శక్తినీ ఇచ్చినా కానీ అది కొద్దిసేపు మాత్రమేనని.. ఆ తర్వాత ఆకలి మొదలవుతుందని అంటున్నారు. అప్పుడు నచ్చినవన్నీ ఒక్కొక్కటిగా తినడం మొదలు పెట్టి ఎక్కువగా తింటామని వివరిస్తున్నారు.
  • మనకు ఆకలి ఉన్నా లేకపోయినా పొద్దున్న ఏదో ఒకటి తినాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేక్​ఫాస్ట్ వీలుకాని సమయంలో కాస్త యోగర్ట్, అరటిపండు తీసుకున్నా మంచిదేనని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిర్మలమ్మ నోట 'మఖానా' మాట- ఇది తింటే షుగర్, బీపీ సమస్యలకు చెక్! ఎంత ఆరోగ్యమో తెలుసా?

'పండ్లు అతిగా తింటే షుగర్, ఊబకాయం వస్తుంది'- రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.