Prathidhwani Debate on Farmers Problems: ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువును ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు. ఒక్క రైతు తప్ప. తాను పండించే పంటకు ధరను తాను నిర్ణయించలేని నిస్సహాయత అన్నదాతది. ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టిని తట్టుకుంటూ అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి మన ఆకలి తీరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ వృత్తిలోనూ లేనన్ని బలవన్మరణాలు కేవలం వ్యవసాయ రంగంలోనే మనకి కనిపిస్తాయి.
రైతన్నపై పగబట్టిన ప్రకృతి - కర్షకుల కష్టానికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? - Prathidhwani on Farmers Problems - PRATHIDHWANI ON FARMERS PROBLEMS
Farmers Problems In Telangana : ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువును ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు. ఒక్క రైతు తప్ప. తాను పండించే పంటకు ధరను తాను నిర్ణయించలేని నిస్సహాయత అన్నదాతది. ప్రపంచంలో ఏ వృత్తిలోనూ లేనన్ని బలవన్మరణాలు కేవలం వ్యవసాయ రంగంలోనే మనకు కనిపిస్తాయి. ప్రకృతి పగబడితే ఆ తప్పు రైతులదా? ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద లేదా? ఇదీ నేటి ప్రతిధ్వని.
Published : May 25, 2024, 10:40 AM IST
దానికి కారణం మన కడుపు నింపుతూ తాను పస్తులు ఉండటమే. ఆరుకాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటే అకాల వర్షాల వల్ల పంటలు పాడైపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలలో వర్షానికి వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. ప్రకృతి పగబడితే ఆ తప్పు రైతులదా? ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద లేదా? ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రయినా పోలంలోనే ఉంటూ, అక్కడే తింటూ సమాజం కోసం శ్రమిస్తున్న కర్షకుల కష్టానికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? ఇదీ నేటి ప్రతిధ్వని.