Pratidwani On Internal Issues In India Alliance : ఇండియా కూటమి భవితవ్యమేంటి? రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు! కీలత నేతల మధ్య పొసగని మాటలు! హరియాణా, మహారాష్ట్ర, దిల్లీ ఇలా వరుస ఓటముల తర్వాత వారి మనుగడపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కలిసి ఉంటే కలదు బలమని ఐక్యతారాగం వినిపించిన వారే విడివిడి పోరాటాలతో ఎందుకీ పరిస్థితులు తెచ్చుకున్నారు? అతిపెద్ద పార్టీగా కూటమికి నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఆ పాత్ర ఎందుకు సమర్థంగా పోషించలేక పోతోంది?
రాజకీయంగా అవకాశాలు ఉండి, ప్రజల్లో మద్దతు ఉండి పోరాడ గల శక్తియుక్తులు ఉండి కూడా ఇండియా కూటమికి ఎందుకని కలిసి రావడం లేదు? అటు పార్లమెంట్ లోక్‌సభ, పెద్దల సభలోనూ భారీగానే ఉన్న సంఖ్యాబలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? విబేధాలు వీడి తిరిగి ఒక్కటిగా ముందుకు సాగగలరా? లేదంటే ముందున్న ప్రత్యమ్నాయాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.