Telangana Tourism Pancharamam Temples Tour:ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన పంచారామాలను దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. ఎందుకంటే పంచారామ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగుతాయని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. మరి మీరు కూడా పంచారామాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ చెబుతోంది తెలంగాణ టూరిజం. ఒక్కరోజులోనే ఐదు ఆలయాలను దర్శించుకునేందుకు అనుగుణంగా మంచి ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పంచారామాలను దర్శించుకోవడానికి తెలంగాణ టూరిజం పంచారామం టెంపుల్స్ టూర్ పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం మూడు రోజులు ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్యాకేజ్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా పంచారామాలైనా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలు చూడొచ్చు. ప్రతి సోమవారం ఈ టూర్ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు రాత్రి 9 గంటలకు ఐఆర్ఓ యాత్రి నివాస్ నుంచి, 9.30 గంటలకు CRO బషీర్‌బాగ్ నుంచి బస్సు ద్వారా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 5 గంటలకు అమరావతి చేరుకుంటారు. అక్కడ హోటల్లో ఫ్రెషప్ అనంతరం అమరావతిలోని అమరేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బయలుదేరుతారు. అక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి భీమవరంలోని సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ద్రాక్షారామాన్ని, సామర్లకోటలోని శివలింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఆ రాత్రికి హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- మూడో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలివే: పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా పెద్దలకు రూ.4,999, చిన్నారులకు రూ.3,999 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- నాన్ ఏసీ హైటెక్ కోచ్ బస్సు
- అమరావతిలో ఫ్రెషప్
- ఫుడ్, దర్శన్ టికెట్లు ఈ ప్యాకేజీలో కవర్ అవ్వవు. ఇవి ప్రయాణికులే చూసుకోవాలి.
- ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.