Corn Capsicum Masala Making Process:సాధారణంగా మొక్కజొన్నలు అంటే కాల్చితినడం, ఉడికించి తినడం చేస్తుంటారు. అంతే కాకుండా బూరెలు, స్నాక్స్.. ఇలా రకరకాలుగా చేసుకుని తింటుంటారు. మరి మొక్కజొన్న గింజలతో కూర ఎప్పుడైనా తిన్నారా? ఏంటి మొక్కజొన్న గింజలతో కూర అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఒక్కసారి ఈసారి రెసిపీ ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. పైగా ప్రిపరేషన్ వెరీ ఈజీ. వంట మొదటిసారి చేసే వారు కూడా పర్ఫెక్ట్గా, టేస్టీగా వండేస్తారు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా అంటే చాలా రుచిగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ "కార్న్ క్యాప్సికం మసాలా కర్రీ"కి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- మిరియాలు - అర టీ స్పూన్
- యాలకులు - 2
- దాల్చినచెక్క - 1 ఇంచ్
- లవంగాలు - 3
- ఎండు కొబ్బరి పొడి - 3 టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు - 3 టేబుల్స్పూన్ల
- టమాటా - 3
- వెల్లుల్లి రెబ్బలు - 8
- అల్లం ముక్కలు - టేబుల్ స్పూన్
- నూనె - 6 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- పచ్చిమిర్చి - 2
- లేత మొక్కజొన్న గింజలు - అరకప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - పావు టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- కారం - ముప్పావు టేబుల్ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- క్యాప్సికం ముక్కలు - అర కప్పు
- కసూరి మేథీ: 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- వేడి నీరు - 1 కప్పు
రాయలసీమ స్టైల్ వెల్లులి కారం పచ్చడి - సువాసనకే మౌత్ వాటరింగ్ అయిపోతుంది!
తయారీ విధానం:
- ముందుగా మిక్సీజార్ తీసుకుని అందులోకి మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, పండిన టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 6టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి ఫ్రై చేసిన తరువాత అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్తా మెత్తబడేవరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత తాజా మొక్కజొన్న గింజలు వేసి వేయించుకోవాలి(ఇక్కడ లేతవి అయితే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేతవి లేకపోతే ముదురు గింజలను ఉడికించి వేసుకోవచ్చు).
- 5 నిమిషాల తర్వాత ఉప్పు, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మసాలాలు మాడకుండా వేయించుకోవాలి.
- వేగిన మసాలాలో ముందే గ్రైండ్ చేసుకున్న టమాట, కాజు మిశ్రమాన్ని వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించుకోండి.
- నూనె పైకి తేలిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకుని 4 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి వేడి నీరు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కూర దగ్గరకు రావడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ పది నిమిషాల్లో కూరను మధ్య మధ్యలో కలుపుతుండాలి.
- ఆ తర్వాత అందులోకి కసూరి మేథీ, కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి దింపుకుంటే సరి.
పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా తెస్తున్నారా? - ఇలా 'ఆలూ రైస్' చేసి పెట్టండి! - బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు
నిమిషాల్లో ఘుమఘుమలాడే "మీల్ మేకర్ కుర్మా"- ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మటన్ కూడా దిగదుడుపే!