ETV Bharat / state

మిస్టరీగా అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ - కేసు సీఐడీకి బదిలీ? - KIDNEY RACKET CASE UPDATE

హైదరాబాద్‌లో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసు - 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం - కేసు సీబీఐకి బదిలీ చేసే అవకాశం

Hyderabad Kidney Racket
Hyderabad Kidney Racket (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 12:10 PM IST

Hyderabad Kidney Racket : రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపుతున్న అలకనంద ఆసుపత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ కేసులో పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ రాకెట్‌ వెనకున్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరందర్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లాక తుది నిర్ణయం వెలువడనుంది. కిడ్నీ రాకెట్‌ కేసులో దాతలు తమిళనాడుకు చెందిన వారు. గ్రహీతలు బెంగళూరుకు చెందిన వారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో. మూడు రాష్ట్రాలతో లింకులు ఉండటం, ఒక్కో కిడ్నీ మార్పిడీ పేరుతో రూ.లక్షల్లో వసూలు చేస్తుండటం, వందలాది మందితో లింకులు ఉండటంతో కేసులు సీఐడీకి అప్పగించాలని భావిస్తున్నారు.

కిడ్నీ రాకెట్‌ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లు, ఫోన్‌ నెంబర్లు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక నుంచి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సలు గతంలోనూ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.

మరోసారి తనిఖీ చేసే అవకాశం : కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు కనీసం 15-20 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరముంటారు. చికిత్స చేయడానికి వైద్యులతో పాటు ఆపరేషన్‌కు ముందు తర్వాత ఐసీయూ, ఆపరేషన్‌ ధియేటర్‌లో నర్సులు, టెక్నీషియన్లు ఉండాలి. ఇంత మంది ఎక్కడి నుంచి వస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలకనంద ఆసుపత్రి 9 పడకలతో ప్రారంభమైందని, ఇందులో ఎలాంటి ప్రత్యేక వసతులు లేవని రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆసుపత్రిని ప్రస్తుతం సీజ్‌ చేసినప్పటికీ ప్రత్యేక అనుమతితో లోపల మరోసారి తనిఖీలు చేసే అవకాశముంది. కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నారు.

ఎంతకు తెగించార్రా - అలకనంద కిడ్నీ రాకెట్​లో విస్తుగొలిపే విషయాలు

అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి నిజమే : డీఎంఈ వాణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.