ETV Bharat / technology

మీకు ఆండ్రాయిడ్​ ఫోన్​ స్క్రీన్​పై గ్రీన్​డాట్​ కనిపించిందా? ఆ సీక్రెట్ ఫీచర్​ అందుకోసమే! - GREEN DOT ON YOUR ANDROID PHONE

ఆండ్రాయిడ్​ ఫోన్​లో సీక్రెట్ ఫీచర్​! మొబైల్​ స్క్రీన్​పై కనిపించే గ్రీన్​ డాట్ అర్థం ఏంటి?

Green Dot on Your Android Phone
Green Dot on Your Android Phone (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 2:40 PM IST

Green Dot on Your Android Phone : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీ మొబైల్​ స్క్రీన్​ కుడిపక్క ఎగువ మూలలో ఎప్పుడైనా గ్రీన్ డాట్​ను (ఆకుపచ్చ చుక్క) గమనించారా? అదేంటో అని ఎప్పుడైనా సందేహం వచ్చిందా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ఆండ్రాయిడ్​ ఫోన్లలో ఈ గ్రీన్​ డాట్ కనిపించడానికి ప్రత్యేక కారణం ఉంది. గోప్యతా సెట్టింగ్​లపై యూజర్​కు మరింత నియంత్రణ ఉండటానికి ఈ స్పెషల్ ఫీచర్​ను తీసుకొచ్చారు. అసలు ఈ ఫీచర్​ ఎలా పనిచేస్తుంది? దీని వల్ల యూజర్లకు కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది సురక్షితమైనదిగా భావించే ఐఫోన్​ లాగానే అనేక వార్నింగ్ సింబల్స్​తో ఆండ్రాయిన్​ ఫోన్లను రూపొందించారు. అందులో ముఖ్యంగా స్క్రీన్​పై కుడి పైభాగంలో కనిపించే ఆకుపచ్చ చుక్క ఫీచర్​ చాలా ప్రత్యేకం. దాన్ని చూసినప్పుడు యూజర్లకు ఏదో ఆన్​లో ఉంది అనే భావన కలుగుతుంది. కానీ అది ఏ ఫీచర్​తో ముడిపడి ఉందో అనేది మాత్రం తెలియదు.

యూజర్లు వారి ప్రైవసీ సెట్టింగ్​లపై మరింత నియంత్రణ సాధించేందుకు ఈ ఫీచర్​ను తీసుకొచ్చారు. ఈ గ్రీన్ డాట్​ను చూసిన తర్వాత, మీ ప్రైవసీ సెట్టింగ్​లు, ఫోన్​ పర్మిషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం అర్థమవుతుంది.

గ్రీన్ డాట్ అంటే ఏమిటి?
ఐఫోన్​లో వివిధ ఫీచర్లను సూచించడానికి గ్రీన్​, ఆరెంజ్​ డాట్​లు ఉంటాయి. కానీ ఆండ్రాయిడ్​లో అన్ని ఫీచర్లను సూచించడానికి ఒక గ్రీన్​ డాట్​ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ స్క్రీన్​పై గ్రీన్​ డాట్ ఉంటే- మీరు ప్రస్తుతం ఓపెన్​ చేసిన యాప్​, మీ డివైజ్​ కెమెరా మైక్రోఫోన్ ఉపయోగిస్తున్నట్లు అర్థం. అయితే కెమెరా తెరిచి ఉంచితే ఇది సమస్య కాకపోయినా, ఓపెన్ యాప్‌లకు కెమెరా లేదా మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చి ఆ విషయం మీకు గుర్తులేకపోతే గ్రీన్ డాట్​ మిమ్మల్ని అప్రమత్తం చేయవచ్చు.

గ్రీన్ డాట్ చూస్తే ఏం చేయాలి?
శామ్​సంగ్​ కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం- మీ కెమెరా లేదా మైక్రోఫోన్‌ను ఏ యాప్ ఉపయోగిస్తుందో నాలుగు దశల్లో మీరు గుర్తించవచ్చు. మొదట నోటిఫికేషన్​ కనిపించినప్పుడు, అక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాని వల్ల అలర్ట్​ వచ్చింది కెమెరా కోసమా లేదా మైక్రోఫోన్​ లేదా రెండింటి కోసమా అని యూజర్లకు తెలియజేస్తుంది. అనంతరం ఆ డాట్​ మరింత చిన్నగా మారిపోతుంది.

నోటిఫికేషన్​ బార్​లో ఓపెన్​ చేసిన తర్వాత అందులో కనిపిస్తున్న డాట్​పై క్లిక్ చేయాలి. దీంతో అది పెద్దగా మారుతుంది. అనంతరం ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫోన్ కెమెరా, మైక్రోఫోన్​ లేదా రెండింటినీ ఏ యాప్​ ఉపయోగిస్తుందో కనిపిస్తుంది. అయితే యూజర్లు ఉపయోగిస్తున్న ఆ యాప్​లు మీ కెమెరా, మైక్రోఫోన్ ఫీచర్లను ఉపయోగించాలనుకుంటే మీరు ముందుకు సాగవచ్చు.

అయితే మీరు ఏ యాప్​నకు కెమెరా, మైక్రోఫోన్ లేదా రెండింటికీ యాక్సెస్​ ఇచ్చిన విషయం గుర్తులేకపోతే, సెట్టింగ్స్​ ఓపెన్​ చేసి పర్మిషన్లను ఆఫ్​ చేయాలి. ఒక వేళ మీరు వాడుతున్న యాపే దొంగతనంగా కెమెరా, మైక్రోఫోన్ ఉపయోగిస్తోందని నొటిఫికేషన్​ వస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించొద్దు. అవసరమైతే ఆ యాప్​ను మొత్తంగా డిలీట్​ కూడా చేయొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.