ETV Bharat / state

ఫ్రీగా డబుల్ డెక్కర్‌ ఎక్కేద్దాం - 'జాయ్​'గా భాగ్యనగరాన్ని చుట్టేద్దాం - FREE DOUBLE DECKER BUSES IN HYD

పర్యాటక ప్రదేశాలను చూసేందుకు డబుల్ డెక్కర్ బస్సులు - ప్రారంభించిన హెచ్​ఎండీఎ

HMDA Started Double Decker Buses in Hyderabad
HMDA Started Double Decker Buses in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 1:34 PM IST

HMDA Started Double Decker Buses in Hyderabad : హైదరాబాద్​లో డబుల్ డెక్కర్ బస్సులంటే గతంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. తర్వాత అవి మూలకు చేరినా కొన్నేళ్ల కిందట కొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలోని సుందర ప్రదేశాలను పర్యాటకులకు చూపించాలనే ఉద్దేశంలో 'జాయ్​రైడ్'​ పేరుతో హెచ్​ఎండీఏ వీటిని ప్రవేశపెట్టింది. వీటిల్లో ప్రయాణం ఉచితమే అయినా, ప్రచారం లేక ఆదరణ లేకుండా పోయింది. బస్సు ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ దిగాలనే విషయాలపై అవగాహన లేక ఎక్కువగా ఖాళీగానే చక్కర్లు కొడుతున్నాయి.

ఫారిన్ కాదు.. మన హైదరాబాదే.. త్వరలోనే డబుల్​ డెక్కర్​ బస్సుల రయ్ రయ్​..

  • డబుల్​ డెక్కర్ బస్సులో డ్రైవర్​తో 65 మంది కూర్చునే సీట్లు ఉంటాయి. పూర్తిస్థాయి ఏసీ సదుపాయం ఉంటుంది.
  • హైటెక్​ సిటీ, సాలార్​జంగ్ మ్యూజియం, ట్యాంక్​బండ్​ వంటి పర్యాటక ప్రదేశాలను కలుపుతూ చక్కర్లు కొడతాయి.
  • ట్యాంక్‌బండ్, నెక్లెస్​రోడ్, బిర్లా మందిర్, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, కేబుల్‌ బ్రిడ్జి, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల వైపుగా వెళ్తాయి.
  • పర్యాటకులు కోరితే 5 నిమిషాల పాటు బస్సు ఆపి ప్రదేశాలను చూడటానికి అవకాశం ఇస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు. సుమారు 12-15 కి.మీ ప్రయాణించొచ్చు.
  • సైబర్ టవర్స్ నుంచి హైటెక్​ సిటీని చుట్టేయడానికి మూడు బస్సులను కేటాయించారు. ఒక్కో సర్వీస్​కి మధ్య సుమారు 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి బస్సు రెండు ట్రిప్పులు తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
  • జేబీఎస్ నుంచి సాలార్​జంగ్ మ్యూజియం వరకు మరో 3 బస్సులు మధ్యాహ్నం 2 వరకు నడుపుతారు. సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు ట్యాంక్​బండ్​ చుట్టూ తిరుగుతాయి. సంజీవయ్య పార్కు, లేక్​ వ్యూ, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం, లుంబినీ పార్కు తదితర ప్రాంతాల్లో స్టాపులు ఉంటాయి.

అవి ఏర్పాటు చేస్తే సరి : హెచ్​ఎండీఏ ఆరు బస్సులను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం 3 బస్సులే కనిపిస్తున్నాయి. అవి బస్టాపుల్లో ఆపడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. డబుల్​ డెక్కర్ బస్సులు ఆగే ప్రదేశాల్లో ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. బస్సులపైన ఉచిత ప్రయాణమని బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ట్యాంక్​బండ్​ చుట్టూ తిరిగే ఈ బస్సులు కేవలం హుస్సేన్​సాగర్​ పరిసరాల్లోనే ఆగుతున్నాయి.

హైదరాబాద్​లో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌ - నేడు సీఎం రేవంత్​ శంకుస్థాపన

గ్రేటర్​లో మళ్లీ డబుల్‌ డెక్కర్ బస్సులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.