ETV Bharat / technology

అల్ట్రా-స్లిమ్, ఆకట్టుకునే డిజైన్​తో 'గెలాక్సీ S25 ఎడ్జ్'- టీజర్ చూశారా? - SAMSUNG GALAXY S25 EDGE

'గెలాక్సీ S25 ఎడ్జ్' టీజర్ రిలీజ్- ధర, స్పెసిఫికేషన్స్ లీక్!

Samsung Galaxy S25 Edge Teaser Released
Samsung Galaxy S25 Edge Teaser Released (Photo Credit-)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 24, 2025, 2:30 PM IST

Samsung Galaxy S25 Edge: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ జనవరి 22న తన 'గెలాక్సీ అన్​ప్యాక్డ్ 2025' ఈవెంట్ నిర్వహించింది. ​ఈ ప్రోగ్రాంలో కంపెనీ గెలాక్సీ 25 సిరీస్​ను లాంఛ్ చేసింది. కంపెనీ తన ఫ్లాగ్​షిప్​ మోడల్​ S-సిరీస్​​లో భాగంగా ఈ లైనప్​లో 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25+', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్​ను తీసుకొచ్చింది.

కంపెనీ ఈ మూడు స్మార్ట్​ఫోన్​లతో పాటు మరో మోడల్​ను కూడా ఈ ఈవెంట్​లో ప్రవేశపెట్టింది. గత కొన్ని నెలలుగా 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్​తో పాటు 'గెలాక్సీ S25 స్లిమ్' పేరుతో స్పెషల్ ఎడిషన్ కూడా వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కంపెనీ మాత్రం ఈ ఈవెంట్​లో తన 9 ఏళ్ల లైనప్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. శాంసంగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' పేరుతో కొత్త ఫోన్​ను టీజ్ చేసింది.

గెలాక్సీ అన్​ప్యాక్డ్ 2025 ఈవెంట్​లో కొత్త ఫోన్ టీజర్: శాంసంగ్ తన 'గెలాక్సీ అన్​ప్యాక్డ్ 2025' ఈవెంట్​లో 'గెలాక్సీ S25 ఎడ్జ్' స్మార్ట్​ఫోన్​ టీజర్​ను రిలీజ్ చేసింది. ఈ టీజర్​ ద్వారా కంపెనీ తన 'గెలాక్సీ ఎడ్జ్' సిరీస్​ను 9 సంవత్సరాల తర్వాత తిరిగి మార్కెట్లోకి రాబోతున్నట్లు వెల్లడించింది. 'గెలాక్సీ ఎస్25 ఎడ్జ్' ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది. అంటే కంపెనీ ఈ ఫోన్‌ను 2025 సెకండ్ క్వార్టర్​లో జరిగే MWC 2025 ఈవెంట్‌లో లేదా జులైలో జరిగే వార్షిక ఈవెంట్‌లో లాంఛ్ చేయొచ్చు.

శాంసంగ్ రిలీజ్ చేసిన టీజర్​లో ఈ అప్​కమింగ్ 'గెలాక్సీ ​S25 ఎడ్జ్' వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కన్ఫార్మ్ చేసింది. ఈ ఫోన్​లోని డ్యూయల్ కెమెరా సెటప్‌కు సరిపోయేలా కంపెనీ ఓవల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను అందిస్తుంది. GSMAreana నివేదిక ప్రకారం ఈ ఫోన్ ఫ్లాట్ AMOLED డిస్​ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్‌తో వస్తుంది.

తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ఎంట్రీకి రెడీ: శాంసంగ్ గెలాక్సీ ఎడ్జ్ లైనప్​లోని ఈ అప్​కమింగ్ ఫోన్​లో పవర్​ బటన్, వాల్యూమ్ రాకర్ కుడి వైపున ఉంటాయి. ఇది కాకుండా కంపెనీ ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్లపై ఎలాంటి వివరాలూ అందించలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ మాదిరిగా 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మందం కూడా 6.4mm ఉంటుందని అంచనా. ఇది గానీ జరిగితే ఇది అల్ట్రా-స్లిమ్ స్మార్ట్​ఫోన్ అవుతుంది. అంతేకాక దీనిలో ప్రాసెసర్ కోసం కంపెనీ క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందించొచ్చు. ఇది 12GB RAM సపోర్ట్‌తో రావచ్చు. ఈ ఫోన్ ధర కూడా 'శాంసంగ్ గెలాక్సీ S25', 'శాంసంగ్ గెలాక్సీ S25+' మోడల్స్ రేటు మధ్య ఉండొచ్చు.

చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన ఎయిర్​టెల్, జియో, వీఐ!- డేటా అవసంలేని వారికి ఇక పండగే!

పనిచేయకుండా ఆగిపోయిన చాట్​జీపీటీ- గగ్గోలు పెడుతున్న వినియోగదారులు!

అదిరే ఏఐ ఫీచర్లతో గెలాక్సీ S25 అల్ట్రా- ధర కూడా 14వేలు పెరిగిందిగా!- మరి అంత రేటుకు ఇది విలువైనదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.