Nani Hit 3 Teaser : నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'హిట్ 3: ది థర్డ్ కేస్'. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 మే 1న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం టీజర్ రిలీజ్ చేశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంత్ టి నిర్మిస్తున్నారు. మరి మీరు ఈ టీజర్ చూశారా?