ETV Bharat / state

ఆ జిల్లాలో 'గుండెపోటు' వస్తే అంతే సంగతులు - అత్యవసర వేళల్లో ప్రాణాలు కోల్పోతున్న వైనం! - PROBLEMS IN ADILABAD RIMS

ఆదిలాబాద్ రిమ్స్​లో కార్డియాలజిస్టులు లేక గుండె జబ్బు రోగుల అవస్థలు - సుదుర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని దయనీయ పరిస్థితి

Cardiology Doctors Shortage Impact on Patients
Cardiology Doctors Shortage Impact on Patients (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 1:29 PM IST

Cardiology Doctors Shortage Impact on Patients : ఆదిలాబాద్‌ రిమ్స్‌ హాస్పిటల్​లో గుండె సంబంధిత సమస్యలు(హృద్రోగ), గుండెపోటుతో వచ్చే బాధితులకు చికిత్స అందుబాటులో లేకుండాపోయింది. రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్​లో కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండి అందులో అత్యాధునిక(అడ్వాన్సిడ్) క్యాథ్‌ల్యాబ్, ఇతర పరికరాలు సైతం ఉన్నాయి. అవసరమైన గుండె వ్యాధి నిపుణులు(కార్డియాలజిస్ట్‌, కార్డియాలజీ సర్జన్) లేక అవన్నీ నిరుపయోగంగా మారిన పరిస్థితి నెలకొంది.

కార్డియాలజీ వైద్య నిపుణులు లేకపోవటంతో గతంలో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు చెందిన సీఎఫ్‌ ఒకరు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి గుండె సంబంధిత సమస్యతో వచ్చిన వారికి ఇక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేసి హైదరాబాద్‌ లేదా మహారాష్ట్రకు రెఫర్‌ చేయాల్సి దుస్థితి నెలకొంది. సుదూర ప్రాంతంలోని ఆసుపత్రికి వెళ్లేలోపు బాధితుడికి సమస్య మరింత తీవ్రమై ప్రాణాపాయం ఏర్పడే అవకాశాలున్నాయి.

నిరుపేదలకు తప్పని తిప్పలు : ఆదిలాబాద్‌ పట్టణంలోని 2 ప్రైవేటు హాస్పిటల్స్​లో క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఆ ఆసుపత్రుల్లో ఎంజియోగ్రాం చేయించుకోవటానికి దాదాపు రూ.25 వేలకు పైగా వ్యయం చేయాల్సి ఉంటోంది. ఒక వేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.1.50 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ మేరకు నిరుపేదలకు అంతసొమ్ము చెల్లించే స్తోమత ఉండటం లేదు. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఆర్థిక కష్టనష్టాలకు గురవు తున్నారు.

నిరుపయోగంగా క్యాథ్‌ల్యాబ్‌ : ఇది రిమ్స్‌ అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్​లోని క్యాథ్‌ల్యాబ్‌ గది. హృద్రోగ సంబంధిత సమస్యల బాధితులకు ఈ గదిలోనే ఎంజియోగ్రాం చేయటంతో పాటు అవసరమైన స్టెంట్లు వేయటం, శస్త్ర చికిత్సలు చేసేవిధంగా అన్ని అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా చికిత్స అందలేదు. కారణం ఆ విభాగంలో సంబంధిత వైద్యులు లేకపోవటమే.

జిల్లా స్థాయి అధికారి సైతం : ఇటీవల జిల్లా డీఈవో ఒకరు గుండెపోటు బారిన పడ్డారు. స్థానిక ప్రైవేటు హాస్పిటల్​లో చికిత్సలు అందించాక మళ్లీ హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి కోలుకున్నారు. స్థానికంగా ఎంజియోగ్రాం, క్యాథలాబ్‌ అందుబాటులో ఉంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. హార్ట్ అటాక్ బారిన పడి రిమ్స్‌కు వచ్చిన బాధితులు ప్రాథమిక పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు తరలించే సమయంలో మృతి చెందిన ఘటనలు కూడా గతంలో పలు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.

ప్రయాణ ఖర్చులే బారెడయ్యాయి : ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అథర్‌ఉద్దీన్‌ది నిరుపేద కుటుంబం. ఇటీవల గుండె సంబంధిత సమస్య రావటంతో మహారాష్ట్రలోని యావత్మాల్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స కోసం ఖర్చులు ఎక్కువవుతున్నాయని హైదరాబాద్‌ నగరానికి వెళ్లారు. హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్​లో చేరగా వాల్వ్‌(కవాటా)లు పూడుకుపోయినట్లు ఎంజియోగ్రాంలో తేలింది. అక్కడ శస్త్ర చికిత్స(సర్జరీ) చేయించుకోగా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. శస్త్ర చికిత్స ఉచితంగా జరిగినప్పటికీ రవాణా ఖర్చులు తడిసి మోపెడైనట్లు బాధితుడు వాపోయారు.

ఇల్లందు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత - అవస్థలు పడుతున్న రోగులు

Hyderabad Area Hospitals Facilities : బస్తీ దవాఖానాల్లో 11 తర్వాతే పరీక్షలు.. ఇబ్బందులు పడుతున్న జనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.