ETV Bharat / politics

కమ్యూనిటీ హాల్​ ప్రారంభోత్సవం కోసం వెళ్లిన కేటీఆర్ - షాక్ ఇచ్చిన అధికారులు - KTR COMMUNITY HALL OPENING STOP

సిరిసిల్ల కమ్యూనిటీ హాల్​ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్న బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు - కేటీఆర్ వచ్చే ముందు కమ్యూనిటీ హాల్​కు తాళం వేసిన అధికారులు

Community Hall Opening Function Stop In Sircilla
Community Hall Opening Function Stop In Sircilla (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 5:32 PM IST

Community Hall Opening Function Stop In Sircilla : సిరిసిల్ల ఐదో వార్డులో కమ్యూనిటీ హాల్​ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు బీఆర్​ఎస్ కౌన్సిలర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. త్వరలో ముగియబోతున్న మున్సిపల్ పాలకవర్గ వీడ్కోలు సమావేశానికి సిరిసిల్ల వచ్చిన కేటీఆర్‌ తొలుత సుభాష్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌ ప్రారంభించాలని భావించారు.

ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమ్యూనిటీ హాల్‌కు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మిగతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విషయం తెలిసిన బీఆర్​ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ తీరుపై భగ్గుమంటున్నారు. అధికారులు కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొత్తి కమ్యూనిటీ హాల్​కు తాళాలు వేశారని మండిపడ్డారు.

బీఆర్​ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి - రేషన్ కార్డులపై ప్రజలు తిరగబడటం ఖాయమన్న కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.