తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దీపావళి స్పెషల్​ "మోతిచూర్​ లడ్డూ" - ఈ టెక్నిక్​ తెలిస్తే బూందీ గరిటెతో పనేలేదు - టేస్ట్​లో నో కాంప్రమైజ్​! - HOW TO MAKE MOTICHOOR LADDU

- స్వీట్​షాప్​ స్టైల్​ రుచి ఇంట్లోనే - ఈ దివాళీకి ట్రై చేసి ఎంజాయ్​ చేయండి

Diwali Special Motichoor Laddu
Diwali Special Motichoor Laddu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 3:34 PM IST

Diwali Special Motichoor Laddu: దీపావళి అనగానే కొత్త దుస్తులు, బాణాసంచా మోతలే కాదు.. నోరూరించే స్వీట్స్​ కూడా ఉంటాయి. ఇవి తినడమే కాదు.. బంధువులకు, అతిథులకు గిఫ్ట్​లగా కూడా ఇస్తుంటారు. అయితే.. దీపావళి స్వీట్స్​ అనగానే లిస్ట్​లో మైసూర్​పాక్​, బాదుషా, తొక్కుడు లడ్డూలు, మోతీచూర్​ లడ్డూలు ఇలా ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా అందరీ ఫేవరెట్​ రెసిపీ మోతిచూర్​ లడ్డూ. దీని టేస్ట్​ మరేదానికి రాదు. అందుకే చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తుంటారు.

అయితే.. బయట స్వీట్​ షాప్స్​లలో లభించే ఈ లడ్డూలో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోవాలి. ఏంటి మోతీచూర్​ లడ్డూను ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవడమా అని షాక్​ అవుతున్నారా? నిజమేనండీ.. ఎంతో రుచికరమైన లడ్డూలను చాలా సింపిల్​గా, టేస్టీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇది చేయాలంటే బూందీ గరిటె అవసరమే లేదు. మరి, లేట్​ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • శనగపిండి - పావు కేజీ
  • నీళ్లు - ఒకటిన్నర కప్పులు(350ml)

లిక్విడ్​ గ్లూకోజ్​ కోసం కావాల్సిన పదార్థాలు:

  • పంచదార - పావు కప్పు
  • వాటర్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - చిటికెడు
  • నిమ్మరసం - అర చెక్క

పాకం కోసం:

  • పంచదార - 400 గ్రాములు
  • నీళ్లు - ఒకటింపావు కప్పులు(300ml)
  • ఆరెంజ్​ లేదా యల్లో ఫుడ్​ కలర్​ - పావు టీ స్పూన్​
  • యాలకలు పొడి - 1 టీస్పూన్​
  • నెయ్యి - 1 టేబుల్​ స్పూన్​
  • పుచ్చపప్పు - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా లిక్విడ్​ గ్లూకోజ్​ తయారు చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పంచదార, నీళ్లు పోసుకోవాలి.
  • ఫ్లేమ్​ను మీడియం​లో పెట్టి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
  • మంటను లో-ఫ్లేమ్​లో ఉంచి స్పూన్​తో కలుపుతూ ముదురు తీగ పాకం వచ్చేంతవరకు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పంచదార పాకాన్ని ఓ గిన్నెలో పోసుకుని కదపకుండా పూర్తిగా చల్లారినివ్వాలి.
  • ఇప్పుడు పిండి కలుపుకోవాలి. అందుకోసం ఓ బౌల్​ తీసుకుని శనగపిండిని జల్లించుకోవాలి.
  • ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బజ్జీలా పిండి మాదిరి కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి.
  • ఈలోపు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకువాలి.
  • నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా గరిటెతో బిస్కెట్ల షేప్​లో నూనెలో వేసుకోవాలి.
  • వాటిని రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
  • అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టుకోవాలి. అందులో పంచదార, నీళ్లు పోసి ఫ్లేమ్​ను హై to మీడియం అడ్జస్ట్​ చేసుకుని పంచదారను కరిగించుకోవాలి.
  • షుగర్​ పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, ఫుడ్​ కలర్​ వేసుకుని మరిగించుకోవాలి.
  • పాకం మరుగుతున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి ఫ్లేమ్​ను సిమ్​లో పెట్టుకుని పంచదార పాకం మొత్తం బూందీకి పట్టేలా ఓ 4 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత నెయ్యి, లిక్విడ్​ గ్లూకోజ్​ వేసి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి లడ్డూ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
  • లడ్డూ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చపప్పు వేసుకుని కలిపి చేతికి నెయ్యి రాసుకుని కావాల్సిన సైజ్​లో లడ్డూల్లా చుట్టుకోవాలి.
  • అనంతరం లడ్డూలపై సిల్వర్​ ఫాయిల్​, జీడిపప్పు పెట్టి సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్​ లడ్డూ రెడీ. వీటిని జాగ్రత్తగా స్టోర్​ చేస్తే సుమారు 15 రోజులు నిల్వ ఉంటాయి.
  • నచ్చితే మీరూ ఈ దీపావళికి ట్రై చేయండి.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్​ సూపరంతే!

గుంటూర్​ స్పెషల్​ "కోవా మాల్పూరి" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్​- పైగా రుచి అద్భుతం!

దీపావళి స్పెషల్ స్వీట్ "సజ్జప్ప" - ఒకసారి చేస్తే 2 నెలలు ఉంటుంది - పైగా టేస్ట్​ అద్భుతం!

ABOUT THE AUTHOR

...view details