IRCTC Wonders of Wayanad Package: పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రెస్ కేరళ. అందుకే చాలా మంది కేరళ విజిట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరి మీరు కూడా కేరళలోని పర్యాటక ప్రదేశాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే మీకో సూపర్ ఛాన్స్ ఇస్తోంది.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. కేరళ వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేసేందుకు ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..
వండర్స్ ఆఫ్ వయనాడ్(Wonders Of Wayanad) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్సీటీసీ. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ సాగుతుంది. వయనాడ్‌లోని పలు ప్రదేశాలను విజిట్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తంగా 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ప్రతి మంగళవారం రోజుల్లో ఈ ప్రయాణం ఉంటుంది. జర్నీ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ Mangalore Central Express బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 06.17 నిమిషాలకు కన్నూర్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్ చెకిన్ అయ్యి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం సెయింట్ ఏంజెలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. అక్కడి నుంచి వయనాడ్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను విజట్ చేయవచ్చు. ఆ రాత్రి కాల్పెట్టలో బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం హోటల్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కుర్వాదీప్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్‌ను విజిట్ చేస్తారు. ఆ రాత్రికి కూడా కాల్పెట్టలోనే బస చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును సందర్శిస్తారు. రాత్రి కాల్పెట్టలోనే స్టే చేయాలి.
- ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడ్కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్ తర్వాత సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్‌లో షాపింగ్ చేయవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వ్స్టేషన్కు వెళ్తారు. ఆ రాత్రి 11.35కి హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ పూర్తవుతుంది.
అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!
ధర వివరాలు చూస్తే: