తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

IRCTC నార్త్ ఇండియా టూర్​ - మాతా వైష్ణోదేవి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు! - Mata Vaishno Devi With Haridwar - MATA VAISHNO DEVI WITH HARIDWAR

IRCTC Tour Package : ఉత్తర భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలతోపాటు పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఐఆర్​సీటీసీ.. భారత గౌరవ టూరిస్ట్​ ట్రైన్ ఓ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC Tour Package
IRCTC Tour Package (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 4:54 PM IST

IRCTC Mata Vaishno Devi With Haridwar Rishikesh Yatra Tour: ఇండియన్​ ర్వైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​.. భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ రైలు ద్వారా ఎన్నో ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్యాకేజీని టూరిస్టుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర భారత దేశంలోని పలు దేవాలయాలు, పర్యాటన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇంతకీ ఆ ప్యాకేజీ ఏంది? ధర ఎంత? ఎన్ని రోజులు సాగుతుంది? ప్రయాణం ఎలా ఉంటుంది? ఏఏ ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీసీ.. భారత గౌరవ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా మాత వైష్ణో దేవీ విత్​ హరిద్వార్​ రిషికేశ్​ యాత్ర పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ ప్యాకేజీ మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఆగ్రా, మథుర, శ్రీ మాత వైష్ణో దేవి, హరిద్వార్​, రిషికేశ్​ ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు విజయవాడ రైల్వే స్టేషన్​ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ బయలుదేరుతుంది. అక్కడి నుంచి గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్​, బోనగిరి, జనగాం, కాజీపేట మీదుగా జర్నీ సాగుతుంది.
  • రెండో రోజు పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్​ కాగజ్​నగర్​, బల్హర్షా, వార్ధా, నాగ్​పూర్​ మీదుగా మూడో రోజు ఉదయం ఆగ్రా కాంట్​కు చేరుకుంటారు.
  • మూడో రోజు ఉదయం ఆగ్రాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడి చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అనంతరం తాజ్​మహల్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత ఆగ్రా ఫోర్ట్​ సందర్శిస్తారు. ఆ రాత్రికి ఆగ్రాలోనే స్టే చేయాలి.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మధుర బయలుదేరుతారు. అక్కడ శ్రీ కృష్ణ జన్మ భూమిని దర్శించుకుంటారు. మధుర రైల్వే స్టేషన్​ నుంచి మాతా వైష్ణోదేవి కత్రాకు బయలుదేరుతారు.
  • ఐదో రోజు మాతా వైష్ణోదేవి కత్రా రైల్వే స్టేషన్​కు చేరుకున్నాక అక్కడి నుంచి హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ వైష్ణోదేవి దర్శనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్​ వివరాలు ఫిల్​ చేస్తారు. అయితే అక్కడ మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకున్నవారు సొంత ఖర్చు ద్వారానే దర్శించుకోవాలి. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.

ఐఆర్​సీటీసీ కేరళ టూర్​ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! ధర చాలా తక్కువ!

  • ఆరో రోజు కత్రా రైల్వే స్టేషన్​ నుంచి హరిద్వార్​కు ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఏడో రోజు ఉదయం హరిద్వార్​ చేరుకోగా ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్​ అనంతరం మానస దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం గంగా హారతి దర్శనం ఉంటుంది. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • ఎనిమిదో రోజు ఉదయం గంగా స్నానాలు చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా రిషికేశ్​ వెళ్లి రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులా దర్శించుకుంటారు. అక్కడి నుంచి రిషికేశ్​ రైల్వే స్టేషన్​కు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
  • తొమ్మిదో రోజు మొత్తం రైలు ప్రయాణం ఉంటుంది.
  • పదో రోజు నాగ్​పూర్, వార్ధా, బల్హర్షా, కాగజ్​నగర్​, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్​, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడకు రాత్రి 11:45 గంటలకు చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే:

  • ఎకానమీ(SL)లో పెద్దలకు రూ.17,940 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.16,820గా ఉంది.
  • స్టాండర్డ్​(3AC)లో పెద్దలకు రూ.29,380 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.28,070గా ఉంది.
  • కంఫర్ట్​ (2AC)లో పెద్దలకు రూ.38,770 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు రూ.37,200గా ఉంది.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు(SL, 3AC, 2AC)
  • హోటల్​ అకామిడేషన్​
  • లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • మార్నింగ్​ టీ, బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​ అందుబాటులో ఉంటాయి.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 17వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

ఐఆర్​సీటీసీ "మ్యాజికల్​ మధ్యప్రదేశ్​" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ!

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details