తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వంటల్లో నూనె ఎక్కువగా వాడుతున్నారా? - ఈ టిప్స్ వాడితే సగానికి సగం తగ్గించొచ్చు!

- కర్రీలో ఆయిల్​తో అనారోగ్య సమస్యల ముప్పు!

Oil in Cooking
How to Reduce Oil in Cooking (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

How to Reduce Oil in Cooking :ఏ వంటకమైనా కమ్మగా తయారవ్వాలంటే.. ఉప్పు, కారంతోపాటు కాస్త ఆయిల్​ ఎక్కువగానే ఉండాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే కూరలు, పచ్చళ్ల తాలింపులో నూనె అధికంగా వినియోగిస్తుంటారు. అయితే.. ఈ రెసిపీలు ఆ సమయంలో తిన్నప్పుడు నోటికి రుచిగానే అనిపించినా.. దీర్ఘకాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వంటల్లో నూనెను అధికంగా వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్​ స్థాయులు పెరుగుతాయి. మనం ఉపయోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఫ్యాట్స్‌ ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఏ వంటలోనైనా ఆయిల్​ వాడకాన్ని తగ్గించుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. మరి.. నూనె వాడకం ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ టిప్స్​ పాటించండి :

  • ఫ్రై కర్రీలకు బదులు బేకింగ్, స్టీమింగ్‌కు ప్రాధాన్యమివ్వండి. దీంతో ఎ, డి, కె-విటమిన్లు బాడీకి పుష్కలంగా అందుతాయి.
  • అలాగే ఫ్రైడ్ స్నాక్స్‌కి బదులు రోస్ట్‌ చేసిన, లేదా స్టీమ్‌ చేసిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
  • వంట చేసే క్రమంలో నూనె ఎక్కువగా కాకుండా ఉండడానికి.. డైరెక్ట్‌గా బాటిల్‌లో నుంచి నూనెను పోసే బదులు టీస్పూన్‌ లాంటి వాటితో ఆయిల్‌ వేయండి. ఇలా చేస్తే కూరలో ఆయిల్​ తక్కువగా ఉపయోగించవచ్చు.
  • ఎప్పుడూ ఒకే ఆయిల్​ను కాకుండా కాంబినేషన్ నూనెలనువాడితే మంచిది. సన్‌ఫ్లవర్, నువ్వులు, రైస్‌ బ్రాన్, వేరుశెనగ, కొబ్బరి నూనెల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి చాలా అవసరం.
  • మన బాడీ వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి బాడీకి అందుతాయి. అందుకే వేరు వేరు ఆయిల్స్​ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
  • మనలో చాలామందికి అప్పడాలంటే ఎంతో ఇష్టం. కానీ ఇవి వేయించాలంటే చాలా ఆయిల్ కావాలి. దీని కారణంగా అందులో ఉండే హెల్త్​ బెనిఫిట్స్​ కూడా ఆవిరైపోతాయి. కాబట్టి అప్పడాలని సన్నటి మంట పైన కాల్చుకుంటే నూనె వాడాల్సిన అవసరమే ఉండదు.
  • ఆయిల్​ వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక బుక్​లో రాసుకోండి. అప్పుడు మీకు ఓ అవగాహన వస్తుంది. దీన్ని బట్టి అవసరం అనుకుంటే ఈ చిట్కాల ద్వారా ఆయిల్​ వాడకాన్ని తగ్గించవచ్చు.
  • వేపుళ్లకి వాడిన ఆయిల్​ని మళ్లీ వేయించడానికి యూజ్​ చేయకండి. ఇందువల్ల మన బాడీలోకి ట్యాక్సిన్స్‌ చేరే ప్రమాదం ఉంది.
  • వంట నూనెను ఎక్కువసేపు వేడి చేస్తే అందులో ఉండే విటమిన్లు బాడీకి అందవు. అంతేకాదు.. ఒకసారి వాడిన ఆయిల్​ని ఎక్కువసార్లు వాడకూడదట.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే వాడిన ఆయిల్​​తో ఫ్రెష్​ నూనెను కలపకండి.
  • ఆయిల్​ని వేడి చేసినప్పుడు వాటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద నూనె పొగ రావడం మొదలు పెడుతుందో దానిని 'స్మోకింగ్‌ పాయింట్‌' అంటారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రత్యేకించి వేపుళ్లు చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోకింగ్‌ పాయింట్‌ ఉన్న ఆయిల్​ను మాత్రమే వాడాలి.
  • ఒకసారి ఉపయోగించిన నూనెను మరోసారి వాడే ముందు పాత్రలో అడుగున ఉన్న నూనెను వదిలేస్తే మంచిది. లేదంటే వడగట్టుకుని యూజ్​ చేయాలి.
  • వంట నూనెపై సన్​లైట్​ పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడడం వల్ల ఆయిల్లో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details