Pudina Pulao Recipe :పులావ్‌ను చాలా రకాలుగా చేసుకుంటుంటారు. కూరగాయలతోపాటు మటన్, చికెన్ లాంటి నాన్ వెజ్లతోనూ పులావ్ చేసుకుంటుంటారు. కానీ.. ఈసారి వెరైటీగా పుదీనా పులావ్ ట్రై చేయండి. అది కూడా రాత్రి మిగిలి పోయిన అన్నంతో! అది కూడా ఎక్కువగా కష్టపడకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
అలాగని మిగిలిపోయిన అన్నంతేనే కాదు.. తాజాగా అప్పుడే వండిన రైస్‌తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఈ పుదీనా పులావ్‌ను చల్లని రైతాతో తిన్నారంటే అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- రెండు టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- ఒక బిరియానీ ఆకు
- ఒక ఇంచు దాల్చిన చెక్క
- 5 లవంగాలు
- 4 యాలకలు
- ఒక టీ స్పూన్ షాజీరా
- ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు
- 5 పచ్చి మిరపకాయలు
- 1 టీ స్పూన్ గరం మసాలా
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్
- 3 టేబుల్ స్పూన్ల పుదీనా పేస్ట్
- పుదీనా – చిన్న కట్ట
- ఒక టీ స్పూన్ నిమ్మ రసం (ఆప్షనల్)
- 110 గ్రాముల బియ్యం
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత బిరియానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, షాజీరా వేసుకుని కాసేపు వేయించుకోవాలి.
- ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేయించుకుని.. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
- అనంతరం ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు సుమారు ఒక నిమిషం వేయించుకోవాలి.
- ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పుదీనాను ఇందులో వేసుకుని కలపాలి.
- ఇప్పుడు పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి.
- ఇందులోనే వండుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. (మీకు కాస్త పులుపు కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు. కారం మాత్రం కలపొద్దు)
- చివరగా కొద్దిగా తాజా పుదీనా ఆకులు, వీలైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని దించేస్తే టేస్టీ టేస్టీ పుదీనా పులావ్ రెడీ!
- తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు.
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!
రెస్టారెంట్ స్టైల్ "బటర్ నాన్" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - Butter Naan Recipe