ETV Bharat / offbeat

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు "పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చడి" చేయండి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది! - GREEN CHILLI ONION CHUTNEY

-ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అనే టెన్షన్​ వద్దు -ఇలా పచ్చిమిర్చి పచ్చడి చేస్తే హాయిగా తినొచ్చు

How to Make Green Chilli Onion Chutney
How to Make Green Chilli Onion Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 1:23 PM IST

How to Make Green Chilli Onion Chutney: కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. ఓవైపు మార్కెట్​కు వెళ్లి తీసుకువచ్చే సమయం ఉండదు, మరోవైపు పిల్లల స్కూల్​కు టైమ్​ అవుతుంటుంది. దీంతో చాలా మంది ఈ పూటకి ఏం వండాలి.. అని ఆలోచిస్తుంటారు. అలాంటి సమయంలో పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటే ఎంతో తృప్తిగా తినచ్చు. ఈ పచ్చడి చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. పైగా తాలింపు కూడా లేకుండా.. కేవలం ఇంట్లో లభించే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • పచ్చిమిర్చి - 15
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​)
  • చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజ్​
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • మెంతులు - పావు టీ స్పూన్​
  • ధనియాలు - అర టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • నువ్వులు - 2 టేబుల్​ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా పచ్చిమిర్చి తొడిమలు తీసుకుని శుభ్రంగా కడిగి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ మరీ కారంగా, మరీ చప్పగా ఉండే పచ్చిమిర్చిని తీసుకోవద్దు. అలాగే మీరు తినే కారానికి అనుగుణంగా మిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిర్చిని వేయించుకునేందుకు వీలుగా చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • చింతపండును కూడా శుభ్రంగా కడిగి వేడినీరు పోసి నానబెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత కట్​ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అందులోకి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి కలిపి సిమ్​లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత నువ్వులు, పసుపు వేసి కలిపి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చివరగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని దింపి పక్కన పెట్టాలి.
  • పచ్చిమిర్చి మిశ్రమం చల్లారేలోపు ఉల్లిపాయను ముక్కలుగా కట్​ చేసుకుని విడదీసుకోవాలి.
  • మిక్సీజార్​లోకి చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. ఆ తర్వాత కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. రోట్లో రుబ్బుకుంటే ఈ పచ్చడి రుచి అద్దిరిపోతుంది.
  • ఇలా రుబ్బుకున్నా పచ్చడిని గిన్నెలోకి తీసుకుని సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీగా ఉండే పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే అద్దిరిపోతుంది. కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు.

సొరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

పదే పది నిమిషాల్లో పసందైన "పచ్చిమిర్చి వేపుడు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.