తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఉల్లిపాయలు లేకుండా 'లాహోరి గ్రీన్​ చికెన్' - తిన్నారంటే మైమరచిపోతారు! ఓ సారి ట్రై చేయండి! - Lahori Green Chicken Curry - LAHORI GREEN CHICKEN CURRY

Lahori Green Chicken Recipe : నాన్​వెజ్​ ఇష్టపడేవారు చికెన్​తో ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా కొత్తగా ట్రై చేస్తుంటే.. ఎంతో ఇష్టంగా తినొచ్చు. అందుకే ఈసారి కొత్తగా "లాహోరి గ్రీన్​ చికెన్" చేసేయండి. రుచ్చి అద్దిరిపోవాల్సిందే.

Lahori green chicken
Lahori green chicken Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 1:06 PM IST

How To Make Lahori Green Chicken :నాన్​వెజ్​ ప్రియులు ఎక్కువగా చికెన్ కర్రీ, బిర్యానీ వంటివి ట్రై చేస్తుంటారు. అలాగే సండే వచ్చిందా.. చాలా మంది ఇంట్లో నుంచి చికెన్​ ఘుమఘుమలు వస్తుంటాయి. అయితే, రెగ్యూలర్​గా చికెన్​ కర్రీ వండుకుంటే చాలా బోర్​ అనిపిస్తుంది. ఎప్పుడూ ఇదే తినాలా అని నిరాశ చెందుతారు. అయితే ఇకపై అలాంటి ఫీలింగ్​ అక్కర్లేదు. ఎందుకంటే మీ కోసం ఒక వెరైటీ చికెన్​ రెసిపీని తీసుకొచ్చాం. అదే "లాహోరి గ్రీన్ చికెన్​" కర్రీ. పేరు వినగానే చాలా పదార్థాలు కావాలని టెన్షన్​ వద్దు. ఎందుకంటే ఈ కర్రీకి ఇంట్లో లభించే పదార్థాలు చాలు. ఇక ఈ కర్రీని వేడివేడి రైస్​, చపాతీలు, పుల్కాల్లోకి తింటుంటే మజా వస్తుంది! మరి ఇంకెందుకు ఆలస్యం.. లాహోరి గ్రీన్​ చికెన్​ కర్రీ ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేయండి!

లాహోరి గ్రీన్​ చికెన్ కర్రీ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకిలో
  • నెయ్యి- 2 టేబుల్​స్పూన్లు
  • నూనె- 3 టేబుల్​స్పూన్లు
  • పెరుగు -పావు కప్పు
  • పసుపు -టీస్పూన్
  • అల్లం వెల్లులి పేస్ట్- 2 టేబుల్​స్పూన్​
  • ధనియాలపొడి - టీస్పూన్
  • జీలకర్ర పొడి- టీస్పూన్​
  • గరంమసాలా-టీస్పూన్
  • కారం - 1 టీ స్పూన్​
  • కొత్తిమీర- కప్పు
  • పుదీనా- కప్పు
  • పచ్చిమిర్చిలు- 10
  • ఫ్రెష్​ క్రీమ్​- అర కప్పు
  • ఉప్పు-రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిర్చిలు వేసి గ్రైండ్​ చేసి ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి నూనె, నెయ్యి పోసుకోవాలి. ఈ క్రరీలోకి ఆయిల్​తో పాటు, నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్​ చాలా బాగుంటుంది.
  • తర్వాత పచ్చిమిర్చిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకోవాలి. పేస్ట్​ వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్​ ముక్కలని వేసి బాగా కలపాలి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
  • అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు వేసుకుని మిక్స్​ చేయాలి. స్టౌ మంట చిన్నగా పెట్టి చికెన్​ని ఉడికించుకోవాలి.
  • చికెన్​ బాగా ఉడికిన తర్వాత పెరుగు, ఫ్రెష్​ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఒక రెండు నిమిషాలు అలా చికెన్​ని వదిలేసిన తర్వాత.. సర్వ్​ చేసుకుంటే ఘుమఘుమలాడే లాహోరి గ్రీన్​ చికెన్ కర్రీ మీ ముందుంటుంది.
  • నచ్చితే మీరు కూడా రెగ్యూలర్​గా కాకుండా.. కాస్త కొత్తగా ఈ చికెన్ రెసిపీని ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details