తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చలికాలంలో "బీట్‌రూట్ కాంజీ" - ఇన్​ఫెక్షన్స్​ దరిచేరవట - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - KANJI RECIPE IN TELUGU

-నార్త్​ ఇండియా ఫేమస్​ పానీయం -మీరు కూడా ట్రై చేయండి!

Kanji Recipe
How to Make Kanji Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 11:00 AM IST

How to Make Kanji Recipe :శీతాకాలంలో వీచే చల్లటి గాలుల కారణంగా చాలా మంది జలుబు, దగ్గు వంటి రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులను త్వరగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ సీజన్​ మార్పులకు అనుగుణంగా వీటిని ఎదుర్కొవడానికి మన పూర్వీకులు ఎన్నో సహజమైన, ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించేవారు. కొన్ని సంప్రదాయ పద్ధతులు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. అలాంటి వాటిల్లో.. చలికాలంలో ఎక్కువగా తీసుకునే 'బీట్‌రూట్‌ కాంజీ' ఒకటి. దీనిని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు తప్పక సేవిస్తుంటారు. మరి.. ఈ బీట్​రూట్​ కాంజీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • నీరు -రెండు లీటర్లు
  • బీట్‌రూట్‌-కేజీన్నర
  • పసుపు రంగు ఆవాల పొడి-రెండున్నర స్పూన్లు
  • కశ్మీరీ మిరప్పొడి-టేబుల్‌ స్పూను
  • ఉప్పు-టేబుల్‌ స్పూను

తయారీ విధానం..

  • ముందుగా బీట్​రూట్​లను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకోవాలి. ఆపై వాటిని పొడవుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక అన్నం వండుకునే గిన్నె పెట్టండి. ఇందులో నీళ్లు పోయండి. అలాగే బీట్​రూట్​ ముక్కలు వేసి కొద్దిగా వేడి చేయండి. నీటిని బాగా మరిగించవద్దు. తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఆ వాటర్ చల్లారాక పసుపు రంగు ఆవాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, ఉప్పు వేసి కలపాలి.
  • ఈ ద్రావణాన్ని మట్టి జాడీలో పోసి మూత పెట్టేయాలి. అలాగే దీనిని ఎండ పడేచోట 3 నుంచి 4 రోజులు ఉంచాలి. ఆ టైమ్​లో కలియబెట్టడం, కదపడం లాంటివి చేయొద్దు.
  • ఆ తర్వాత వడకట్టి తాగాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్‌రూట్‌ కాంజీ రెడీ!
  • బీట్​రూట్​ కాంజీ నచ్చితే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

బీట్‌రూట్‌ కాంజీ లాభాలు..

  • ఇది ఒక సంప్రదాయ పులియబెట్టిన పానీయం.
  • దీనిని తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడడంతో పాటు, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి.
  • కాంజీని పులియబెట్టడంతో వీటిలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
  • ఆహారంలోని పోషకాల శోషణలోనూ సాయపడతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • చలికాలంలో మనం చర్మం పొడిబారడం సమస్యతో బాధపడుతుంటాం. బీట్​రూట్​ కాంజీని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందట.
  • కళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంగానూ పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

కల్తీ వంట నూనెతో క్యాన్సర్​ ముప్పు! - FSSAI సూచనలతో స్వచ్ఛతను క్షణాల్లో కనిపెట్టండిలా!

చలికాలంలో పెరుగు తోడుకోవట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే చక్కగా గడ్డ పెరుగు సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details