తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి​" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక! - Gongura Nuvvula Pachadi - GONGURA NUVVULA PACHADI

Gongura Nuvvula Pachadi Recipe : ఆకుకూరల్లో గోంగూర చాలా ప్రత్యేకం. తెలుగువారు దీని రుచికి పడిపోతారు! అలాంటి గోంగూర పచ్చడిని ఆంధ్రా స్టైల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Gongura Nuvvula Pachadi
Gongura Nuvvula Pachadi Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 1:28 PM IST

How To Make Gongura Nuvvula Chutney :మనలో చాలామందికి గోంగూర పచ్చడి అంటే ఎంతో ఇష్టం. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే, ఎప్పుడూ గోంగూర పచ్చడి ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ప్రిపేర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే.. ఈ ఆంధ్రా స్టైల్ రెసిపీ తీసుకోచ్చాం.

గోంగూర పచ్చడిని ఆంధ్రాలో.. ముఖ్యంగా గుంటూర్​ సైడ్​ వాళ్లు నువ్వులతో కలిపి ప్రిపేర్ చేస్తుంటారు. నువ్వులు కలిపిన ఈ పచ్చడి రుచి ఎంతో సూపర్​గా ఉంటుంది. ఒకసారి ఈ పచ్చడితో అన్నం తిన్నారంటే.. మళ్లీ మళ్లీ ప్రిపేర్ చేస్కుంటారు. మరి.. గోంగూర నువ్వుల పచ్చడిని సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • నువ్వులు -పావు కప్పు (50 గ్రాములు)
  • మెంతులు - టేబుల్​ స్పూన్
  • ఆవాలు- టేబుల్​ స్పూన్
  • ఇంగువ- అరటీస్పూన్​
  • పసుపు-టేబుల్​ స్పూన్
  • ఎర్ర గోంగూర ఆకులు - పావు కేజీ
  • ఎండు మిర్చి - 20
  • పచ్చిమిర్చి -7
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు-కొద్దిగా
  • నూనె

తయారీ విధానం :

  • ముందుగా గోంగూర ఆకులను తెంపి శుభ్రంగా రెండుమూడు సార్లు కడగండి. తర్వాత ఆకులను పొడి వస్త్రంపై వేసి కొద్దిగా ఆరనివ్వండి.
  • తర్వాత స్టౌ ​పై పాన్​ పెట్టి సన్నని మంటమీద నువ్వులను వేయించి పక్కన పెట్టుకోండి. నువ్వులు చల్లారిన తర్వాత కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇదే పాన్​లో టేబుల్​స్పూన్​ ఆయిల్​ హీట్​ చేసి మెంతులు, ఆవాలు వేసి కొద్దిగా వేపండి. తర్వాత 20 ఎండుమిర్చిలు వేసుకుని వేయించండి. అలాగే ఇంగువు వేసుకుని మిరపకాయలను వేయించి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి.
  • ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు పాన్​లో ముప్పావుకప్పు ఆయిల్​ హీట్​ చేసి గోంగూర ఆకులను కొద్దిసేపు వేయించండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఇప్పుడు పసుపు వేసి నూనె పైకి కనిపించే వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులో పొడి చేసుకున్న మెంతులు, ఎండుమిర్చిల కారం వేసి కలపండి. అలాగే నువ్వుల పొడి వేసి మరొక సారి బాగా మిక్స్​ చేయండి.
  • పచ్చడి అంత రెడీ అయిన తర్వాత ఉప్పు కరెక్ట్​గా ఉందో లేదో చెక్​ చేసుకోండి. అంతే.. సూపర్ చట్నీ మీ ముందు ఉంటుంది.
  • ఇలా చేసుకుంటే గోంగూర నువ్వుల పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది.
  • ఈ పచ్చడి బయట కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది.
  • రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

గుంటూరు స్టైల్​ "గోంగూర ఉల్లిపాయ పచ్చడి"- ఇలా చేశారంటే మెతుకు మిగల్చరు! - ప్లేట్లు కూడా నాకేస్తారు!

గోంగూర రొయ్యల కర్రీ - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే టేస్ట్​ సూపర్​ హిట్​!

ABOUT THE AUTHOR

...view details