తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రాయలసీమ స్పెషల్ "ఎగ్​ ఉగ్గాని" తిన్నారా? - ఒక్కసారి ఇలా ట్రై చేయండి - టేస్ట్ అదుర్స్!

కొన్నిసార్లు ఇంట్లో బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి ఏవీ ఉండవు. ఇలాంటప్పుడు క్షణాల్లో తయారయ్యే ఎగ్​ ఉగ్గాని ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Egg Uggani Recipe
How to Make Egg Uggani Recipe (ETV Bharat)

How to Make Egg Uggani Recipe :రాయలసీమ స్టైల్లో.. వారు చేసే కొన్ని ప్రత్యేకమైన వంటకాల్లోఉగ్గాని కూడా ఒకటి. అక్కడి వారు చాలా మందిబ్రేక్​ఫాస్ట్​లో ఉగ్గాని బజ్జీలతో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. వేడివేడి మిర్చి బజ్జీలతో ఉగ్గాని కలిపి తింటుంటే టేస్ట్​ అద్దిరిపోతుంది. అయితే.. ఇప్పుడు మనం రాయలసీమ స్టైల్లో ఎంతో రుచికరమైన "ఎగ్​ ఉగ్గాని" ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఎగ్​ ఉగ్గాని చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఎగ్ ఉగ్గాని చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • మరమరాలు-200 గ్రాములు
  • నూనె-2టేబుల్​స్పూన్లు
  • టమాటాలు-2
  • ఉల్లిపాయలు-2
  • గుడ్లు-3
  • పసుపు-చిటికెడు
  • ఉప్పు -రుచికి సరపడా
  • ఆవాలు-అర టీస్పూన్​
  • జీలకర్ర-అర టీస్పూన్​
  • శనగపప్పు-టీస్పూన్​
  • పచ్చిమిర్చి-3
  • ఎండుమిర్చి-2
  • కరివేపాకు-2
  • కొత్తిమీర కొద్దిగా
  • పప్పులపొడి-3 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం..

  • ముందుగా మరమరాలను నీటిలో నానబెట్టుకోవాలి.
  • రెండు నిమిషాల తర్వాత చేతితో మరమరాలను పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరమరాలను ఎక్కువ సేపు నీటిలో ఉంచకూడదు. ఎందుకంటే సాఫ్ట్​గా మారిపోతాయి.
  • తర్వాత స్టౌ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఆయిల్​ వేయండి.
  • ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయండి.
  • అవి కాస్త వేగిన తర్వాత.. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయాలి.
  • ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని కలపండి.
  • టమాటా ముక్కలు సాఫ్ట్​గా ఉడికిన తర్వాత ఇందులో కోడి గుడ్లు పగలగొట్టి వేయండి. కాసేపు ఎగ్స్ వేగనివ్వండి
  • ఆ తర్వాత మరమరాలను అందులో వేసి బాగా కలుపుకోండి. అలాగే పప్పుల పొడి కూడా యాడ్​ చేసి మిక్స్ చేయండి.
  • కుక్​ అయిపోయిందనుకున్న తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. దానికి ముందు కొత్తిమీర చల్లుకోండి.
  • ఇంతే.. ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ ఎగ్​ ఉగ్గాని రెడీ.
  • ఇంట్లో టిఫెన్​ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు క్షణాల్లో తయారయ్యే ఈ ఉగ్గాని ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
  • నచ్చితే మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి.
  • పిల్లలకు ఈవెనింగ్ స్నాక్​గా ఈ రెసిపీ చాలా బాగా సెట్ అవుతుంది. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

ABOUT THE AUTHOR

...view details