తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

టిఫెన్స్​, అన్నంలోకి అద్దిరిపోయే పచ్చడి - గుంటూరు స్టైల్ "అల్లం చట్నీ" - ఇలా చేశారంటే 2 నెలలు నిల్వ! - GUNTUR STYLE GINGER CHUTNEY

అల్లంతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే - దేనిలోకైనా కాంబినేషన్​గా అద్దిరిపోవాల్సిందే!

Guntur Special Ginger Chutney
Ginger Chutney Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2024, 10:47 PM IST

Guntur Special Ginger Chutney Recipe : నిలువ పచ్చళ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ఎక్కువ మందికి నిలువ పచ్చళ్లు అనగానే.. మామిడి, టమాటా, ఉసిరికాయ వంటివి మాత్రమే గుర్తుకొస్తాయి. అలాకాకుండా.. అల్లంతోనూ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఇప్పుడే గుంటూరు స్టైల్​లో ఇలా అల్లం పచ్చడిని తయారుచేసుకోండి. టేస్ట్ సూపర్ ఉండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్ని అన్ని రకాల టిఫెన్స్​తో పాటు అన్నంలో తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది! ఇంతకీ.. ఈ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • 50 గ్రాములు - ఎండుమిర్చి
  • 50 గ్రాములు - అల్లం
  • 50 గ్రాములు - చింతపండు
  • 100 గ్రాములు - బెల్లం
  • 6 నుంచి 7 - వెల్లుల్లి రెబ్బలు
  • 3 టేబుల్​స్పూన్లు - నూనె
  • 1 టేబుల్​స్పూన్ - మినప్పప్పు
  • 1 టేబుల్​స్పూన్ - ధనియాలు
  • 1 టేబుల్​స్పూన్ - శనగపప్పు
  • 1 టేబుల్​స్పూన్ - జీలక్రర
  • రుచికి సరిపడా - ఉప్పు

నోరూరించే రాయలసీమ స్టైల్ "పల్లీ పచ్చడి" - పదే పది నిమిషాల్లోనే అద్దిరిపోయే రుచితో రెడీ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన అల్లాన్ని పొట్టు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. ఒక చిన్న బౌల్​లో చింతపండును నానబెట్టుకోవాలి. అదేవిధంగా.. బెల్లాన్నిసన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి అయ్యాక.. శనగపప్పు, ధనియాలు, మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్​ మీద దోరగా మాగే వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని అవి మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నా.. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అనంతరం స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ రెసిపీలోకి ఎండుమిర్చి ఎంత తీసుకుంటే అల్లంఅంతే మొత్తంలో తీసుకోవాలి. అలాగే.. మంచి నాణ్యమైన ఎండుమిర్చిని ఎంచుకోవాలి. లేదంటే.. సతకగా ఉన్నవి ఎన్ని వేసినా మంచి రుచి రాదని గమనించాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న ఎండుమిర్చి మిశ్రమం, బెల్లం తురుము, నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చిక్కటి పులుసు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • వీటితో పాటు ముఖ్యంగా కొద్దిగా వేడినీళ్లు యాడ్ చేసుకొని మిశ్రమాన్ని చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ స్పైసీ గుంటూరు స్టైల్ "అల్లం పచ్చడి" రెడీ!
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. చట్నీ రుబ్బుకునేటప్పుడు చల్లని వాటర్ పోస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది!
  • ఆవిధంగా చట్నీని రుబ్బుకున్నాక కాస్త కాచి చల్లార్చిన ఆయిల్ పోసుకుని మిక్స్ చేసుకుని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకుంటే దాదాపు 2 నుంచి 3 నెలల పాటు పచ్చడి ఫ్రెష్​గా నిల్వ ఉంటుంది!
  • లేదంటే.. ఆయిల్ వేసుకోకుండా అలా బయట ఉంచినా కనీసం 15 నుంచి 20 రోజుల పాటైనా తాజాగా ఉంటుంది!

కీరదోసను నేరుగా తినడమే కాదు - ఇలా "పచ్చడిని" ప్రిపేర్ చేసుకోండి! - అమోఘమైన రుచిని ఆస్వాదిస్తారు!

ABOUT THE AUTHOR

...view details