Masala Khichdi Recipe in Telugu : రోజూ అన్నం, పప్పు, కూరలే ఏం తింటాం అనిపించినప్పుడు చాలా మంది కిచిడీ చేసుకుంటుంటారు. పప్పులు, కూరగాయలతో ప్రిపేర్ చేసుకునే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. సింగల్పార్ట్ వంటకంగా చెప్పుకొనే కిచిడీని మీరు ఇప్పటి వరకు అనేక రకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా "దాబా స్టైల్ మసాలా కిచిడీని" ట్రై చేశారా? లేదంటే మాత్రం ఓసారి తప్పక ట్రై చేయాల్సిందే. ఇది ఎంతో రుచికరంగా ఉండడంతోపాటు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ కిచిడీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - 1 కప్పు
- కందిపప్పు - అర కప్పు
- పెసరపప్పు - అర కప్పు
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- కసూరి మేతి - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- కారం - తగినంత
- జీలకర్ర పొడి - అరటీస్పూన్
- ధనియాల పొడి - అరటీస్పూన్
- టమాటా - 1
- పచ్చి బఠాణీలు - 3 టేబుల్‌స్పూన్లు
- క్యారెట్ - 1
- ఆలూ - 1 (చిన్న సైజ్ది)
- బీన్స్ - 5
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - 2 టేబుల్‌స్పూన్లు
తాలింపు కోసం :
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- ఎండుమిర్చి - 2
- కారం - అరటీస్పూన్
"పాలకూర కిచిడీ" పోషకాల పంట - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం, కందిపప్పు, పెసరపప్పు మూడింటిని కలిపి తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై తగినన్ని వాటర్ పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ వెలిగించి కుక్కర్ పెట్టి వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక జీలకర్ర, ఇంగువ, కసూరి మేతి, సన్నని ఉల్లిపాయ తరుగు వేసి కలిపి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలిపి అవి కాస్త సాఫ్ట్‌గా మారేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పచ్చి బఠాణీలు, క్యారెట్, ఆలూ, బీన్స్ ముక్కలు, ఉప్పు వేసి అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకోవాలి.
పప్పు నానబెట్టడం లేదు, చుక్క నూనె లేదు! - 5 నిమిషాల్లోనే అద్దిరిపోయే "గోధుమ రవ్వ దోశలు"!
- అనంతరం నానబెట్టుకున్న బియ్యం, పప్పుల మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- అప్పుడు నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిధంగా ఉడికించుకున్నాక మూత తీసి కలిపి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మళ్లీ కొద్దిగా వాటర్ వేసి కలిపి సన్నని సెగ మీద ఉంచాలి.
- ఇప్పుడు మరో బర్నర్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి తుంపలు, కారం వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని తాలింపుని కుక్కర్లో ఉడికించుకుంటున్న మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే, కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఉంచి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే దాబా స్టైల్ "మసాలా కిచిడీ" రెడీ!
రవ్వతో కిచిడీ ఇలా ట్రై చేశారంటే - ఎవ్వరైనా సరే వహ్వా అనాల్సిందే!