ETV Bharat / offbeat

బియ్యంతో కుర్ కురే "వడియాలు" - ఎండతో పని లేదు! - ముక్క వాసన రాకుండా ఏడాది పైనే నిల్వ! - KURKURE VADIYALU

ఎవరైనా ఈజీగా చేసుకునే 'కుర్ కురే వడియాలు' - ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

KURKURE VADIYALU
Vadiyalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 7:19 PM IST

Vadiyalu Recipe in Telugu : అన్నంలోకి కూర, చారు ఎంత కమ్మగా ఉన్నా సరే, సైడ్​ డిష్​గా కాసిని వడియాలూ ఉంటే ఆ రుచి మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే చాలా మంది ఎండాకాలం వస్తే వడియాలు పెట్టుకొని ఏడాదంతా దాచుకొని తింటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పిల్లలు ఇష్టపడేలా బియ్యంతో "కుర్ కురే స్టైల్​లో​ వడియాలు" పెట్టుకోండి. వీటిని ఎండ తగలని వారూ సింపుల్​గా చేసుకోవచ్చు. అలాగే ఒకసారి చేసుకున్నారంటే ఏడాది పాటు ముక్క వాసన రాకుండా ఫ్రెష్​గా నిల్వ ఉంటాయి! ఇక వీటిని సైడ్ డిష్​ మాత్రమే కాకుండా ఈవెనింగ్ టైమ్ స్నాక్స్​గా తిన్నా కరకరలాడుతూ భలే రుచికరంగా ఉంటాయి. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ వడియాల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 2 కప్పులు(400 గ్రాములు)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వాము - 1 టీస్పూన్
  • చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
  • వంటసోడా - పావుటీస్పూన్
  • సన్నని కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్​లో రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యమనే కాదు మీకు అందుబాటులో ఉండే ఏ రైస్​ని అయినా తీసుకోవచ్చు.
  • మరుసటి రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని మరోసారి ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి.
  • అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టి నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి. ఆపై అందులో 8 కప్పుల వరకు వాటర్, ఉప్పు, వాము, చిల్లీ ఫ్లేక్స్, వంటసోడా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై మూతపెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇక్కడ కుక్కర్​లో ఉడికించే వారు 1 కప్పుకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. అదే, మామూలు గిన్నెలో ఉడికిస్తున్నట్లయితే 1 కప్పుకి 5 కప్పుల నీరు తీసుకొని కుక్ చేసుకోవాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్​లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆపై అందులో సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని గరిటెతో మెదిపినట్టుగా చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే రైస్ అనేది కనపడకుండా మెత్తగా, పిండిలా అయ్యేంత వరకు గరిటెతో మాష్ చేస్తూ బాగా కలపాలి.

బయట అప్పడాలు కొనలేకపోతున్నారా? - ఇంట్లోనే ఇలా చేసుకోండి - నిమిషాల్లో రెడీ - పైగా టేస్ట్​ సూపర్​!

  • అనంతరం ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్ లేదా పాల ప్యాకెట్​ని శుభ్రంగా కడిగి తీసుకొని అందులో సరిపడా చల్లారిన పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి.
  • ఆపై చిన్నగా ఒక చివర కట్ చేసి కాటన్ క్లాత్ పరచి దాని మీద నాలుగు ఇంచుల పొడవుతో కుర్​ కురే మాదిరిగా వడియాలను వత్తుకోవాలి. మరీ, సన్నగా కాకుండా కాస్త మీడియంగా ఉండేలా చూసుకోవాలి.
  • అయితే, కుర్ కురే మాదిరిగానే కాకుండా మీకు నచ్చితే రౌండ్​గా చక్రాల మాదిరిగా అయినా చేసుకోవచ్చు.
  • ఇలా పిండి మొత్తాన్ని క్లాత్​పై మీకు నచ్చిన షేప్​లో మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ వత్తుకోవాలి.
  • ఈవిధంగా అన్నీ చేసుకున్నాక ఎండ అందుబాటులో ఉంటే ఎండలో ఎండబెట్టుకోండి. లేదంటే ఫ్యాన్ కింద ఒక రోజు ఆరబెట్టుకున్నా చక్కగా ఆరిపోతాయి.
  • వడియాలు కంప్లీట్​గా డ్రై అయ్యాక క్లాత్​ని వెనుక వైపునకి తిప్పి కాస్త వాటర్ చల్లుకోవాలి. ఇలా చేయడం ద్వారా కుర్​ కురేలను తీసుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా ఈజీగా క్లాత్ నుంచి వచ్చేస్తాయి.
  • ఇప్పుడు అన్నీ తీసుకున్నాక వాటిని మరోసారి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ చల్లి తీసుకుంటున్నాం కాబట్టి ఆ తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి.
  • ఆవిధంగా పూర్తిగా ఆరబెట్టుకున్నాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ముక్క వాసన రాకుండా ఏడాదిపైనే ఫ్రెష్​గా నిల్వ ఉంటాయి!
  • ఇక మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడూ కావాల్సినన్ని నూనెలో వేయించుకొని తీసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే "కుర్ ​కురే వడియాలు" రెడీ!

అన్నం మెత్తగా ఉడికిందని పడేస్తున్నారా?- ఈ వెరైటీలు ట్రై చేయండి - పిల్లలు ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.