ETV Bharat / bharat

టిఫెన్ సెంటర్ రుచిలో "అల్లం చట్నీ" - పదే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Allam Pachadi Recipe

Allam Pachadi Recipe in Telugu : చాలా ఇళ్లలో మార్నింగ్ టిఫెన్ చేస్తారు. అందులో చట్నీ మాత్రం.. ఎప్పుడూ పల్లీ చట్నీయే ఉంటుంది. ఇలాంటివారికోసమే సూపర్ 'అల్లం చట్నీ' రెసిపీని తీసుకొచ్చాం. ఇది టేస్ట్​లో టిఫెన్ సెంటర్​ స్టైల్​కు ఏమాత్రం తగ్గదు! అది కూడా పదే పది నిమిషాల్లో సిద్ధమైపోతుంది. మరి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Ginger Chutney
Allam Pachadi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 9:45 AM IST

How To Make Tiffin Center Style Ginger Chutney : చాలా మంది టిఫెన్స్​లో తినడానికి ఇష్టపడే చట్నీలలో.. అల్లం చట్నీ ఒకటి. పల్లీ చట్నీ(Palli Chutney) మాదిరిగానే దీనికి మంచి క్రేజ్​ ఉంటుంది. ఈ చట్నీని రకరకాలుగా చేసుకుంటుంటారు. కానీ, కొందరికి మాత్రం ఎంత ట్రై చేసినా టిఫెన్ సెంటర్ స్టైల్ టేస్ట్ రాదు. అలాంటివారికోసం పక్కా కొలతలతో సింపుల్​గా ఇంటి వద్దే ప్రిపేర్ చేసుకునేలా స్పైసీ అల్లం చట్నీ రెసిపీ తీసుకొచ్చాం. పది నిమిషాల్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి అద్దిరిపోతుంది! పైగా ఈ చట్నీ ఆరోగ్యానికీ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఇవాళ ఈ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాం. మరి.. అల్లం చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అల్లం పచ్చడికి కావాల్సినవి :

  • అల్లం - 75 గ్రాములు
  • పచ్చిమిర్చి - 200 గ్రాములు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • చింతపండు - 50 నుంచి 70 గ్రాములు
  • బెల్లం - 100 గ్రాములు
  • ఉప్పు - రుచికి తగినంత
  • వేడినీళ్లు - కావాల్సినన్ని

తాలింపు కోసం :

  • నూనె - టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఎండుమిర్చి - 3

తయరీ విధానం :

  • అల్లం చట్నీ కోసం.. ముందుగా కావాల్సినంత అల్లాన్ని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురిమిపెట్టుకోవాలి. అలాగే కాస్త మీడియం కారం ఉండే పచ్చిమిర్చిని ఎంచుకొని వాటిని వేపుకోవడానికి వీలుగా నార్మల్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక.. అందులో తురిమిపెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఆ మిశ్రమాన్ని మరికాసేపు వేయించుకోవాలి. తర్వాత దాన్ని ప్లేట్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న పచ్చిమిర్చి మిశ్రమంతోపాటు చింతపండు పులుసు, బెల్లం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
  • అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మరిగించిన వాటర్ పోసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది!
  • ఆ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి.
  • అందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అయ్యాక టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి.
  • ఆపై దాన్ని ముందుగా రుబ్బుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే టిఫెన్ సెంటర్ స్టైల్ అల్లం చట్నీ రెడీ!
  • ఇంట్లో వేడివేడిగా ఇడ్లీ, దోశలు వేసుకొని.. ఈ అల్లం చట్నీతో తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది అంతే!

ఇవీ చదవండి :

టిఫిన్ సెంటర్ రుచిలో​ 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ!

సూపర్​ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.