Passengers Agitated At shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 10.30కు ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానం ఐదున్నర గంటలు ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఐదు గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
![Passengers Agitated At shamshabad Airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/23494318_passengers.jpg)
కాగా విమానం సాయంత్రం 4 గంటలకు బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమాన ప్రయాణికుల జాబితాలో హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇద్దరు ఐఏఎస్, 8 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు.
![Passengers Agitated At shamshabad Airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/23494318_vijay.jpg)
ఇంజిన్‌లో సాంకేతిక లోపం - మొరాయించిన విమానం : మరోవైపు గురువారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకోవడానికి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పైకి వెళ్లిన ఓ విమానం ఇంజిన్ మొరాయించిన ఘటన చోటుచేసుకుంది. తిరిగి ఆ విమానం పార్కింగ్ బే వైపు రాగా ఏమైందోనని ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందినటువంటి విమాన సర్వీస్ 190 మంది ప్రయాణికులతో గువాహటి వెళ్లడానికి రన్‌వే పైకి చేరుకుంది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న క్రమంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గమనించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. వారి ఆదేశాల మేరకు విమానాన్ని పార్కింగ్ బే వైపు తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ నిపుణులు గంటపాటు శ్రమించి ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని సరిచేశారు. అనంతరం విమానం గంటన్నర ఆలస్యంగా గువాహటికి బయలుదేరింది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీగా పెరిగిన రాకపోకలు - 10 నెలల్లో 2 కోట్ల ప్రయాణికులు