ETV Bharat / lifestyle

రోజూ తలస్నానం చేయడం మంచిది కాదా? తడిపై జుట్టు దువ్వితే ఏం జరుగుతుందో తెలుసా? - HEAD BATH HOW MANY TIMES A WEEK

-తలస్నానం చేయగానే జుట్టు దువ్వుతున్నారా? -హెల్దీ హెయిర్​ కోసం ఈ టిప్స్ పాటించాలట!

How Many Times Head Bath in a Week
How Many Times Head Bath in a Week (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 12, 2025, 12:27 PM IST

How Many Times Head Bath in a Week: కొంత మంది రోజూ స్నానం చేసే క్రమంలో తలస్నానం చేస్తుంటారు. మరికొంరికి జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. మరి, ఇలా చేయడం మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని రోజులకోసారి చేస్తున్నారు?
వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ లాంటి రకరకాల కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోతుంది. దీంతో జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తుంటాం. కానీ, అలా ఎన్నిరోజులకోసారి చేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? జుట్టు జిడ్డుగా ఉంటే నిపుణుల సలహా మేరకు రెండు రోజులకోసారి తలస్నానం చేయాలని.. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అయితే వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇలా ఎప్పుడు, ఎన్నిసార్లు చేసినా గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలని సూచిస్తున్నారు.

How Many Times Head Bath in a Week
రోజూ తలస్నానం చేయడం మంచిది కాదా? (Getty Images)

తలస్నానానికీ పద్ధతుంది
తలస్నానం చేయాలనుకునే ముందుగా జుట్టు చిక్కులు తీసి బాగా దువ్వుకోవాలి. ఫలితంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా ఉంటాయి. ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు నీళ్లలో షాంపూను కలిపి.. ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్‌ చేయాలని తెలిపారు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

గోరువెచ్చని నీరే!
ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్‌ గ్రంథులు దెబ్బతింటాయని అంటున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుందని తెలిపారు. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా కాకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

కండిషనర్‌తో ఫినిషింగ్‌ టచ్
మనలో చాలామంది తలస్నానం చేసి పని పూర్తైపోయిందనుకుంటారు. కానీ, తలస్నానం చేశాక జుట్టుకి కండిషనర్ రాసుకోవడం అన్నింటికంటే ముఖ్యమైందని అంటున్నారు. కండిషనర్ రాసుకోవడం వల్ల చివర్లు చిట్లకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. అలాగే జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా మారడమే కాకుండా.. కండిషనర్ జుట్టు తేమను కోల్పోకుండా చేస్తుందని వివరిస్తున్నారు.

తడి తలను దువ్వకండి
తలస్నానం చేసి రాగానే చాలా మంది దువ్వుతుంటారు. అయితే, తల స్నానం చేసిన తర్వాత కుదుళ్లు బాగా మెత్తబడి ఉంటాయి. ఇలాంటి సమయంలో తల దువ్వితే ఎక్కువగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే ఎప్పుడూ తడి తలను దువ్వే ప్రయత్నం చేయకూడదని సూచిస్తున్నారు. ముందు జుట్టును బాగా ఆరబెట్టుకుని, ఆ తర్వాతే దువ్వుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే తడిగా ఉన్న తల తొందరగా ఆరిపోవాలని టవల్ పెట్టి తెగ తుడిచేస్తూ ఉంటారని.. కానీ అలా చేయకూడదని తెలిపారు. ఇలా చేస్తే జుట్టు నిర్జీవంగా మారిపోతుందని.. అందుకే వీలైనంత వరకు జుట్టుని సహజంగానే ఆరనివ్వాలని సలహా ఇస్తున్నారు. అలాగే తలను ఆరబెట్టుకోవడానికి డ్రయర్స్, బ్లోయర్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం కూడా వీలైనంత తగ్గించేయడం మంచిదని.. వీటివల్ల జుట్టు సహజసిద్ధమైన తేమను కోల్పోతుందని వివరిస్తున్నారు. (నేషనల్ హెల్త్ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ జుట్టు రాలుతోందా? చుండ్రు వేధిస్తోందా? కాకరకాయ రసంతో ఈ సమస్యలకు చెక్!

రోజూ బాడీ లోషన్ రాస్తున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.