Narcotic Department Involved in Masthan Sai Case : యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన మస్తాన్ సాయి కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ దందాపై ఈ టీమ్ ఆరా తీస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సైబరాబాద్ నార్కొటిక్ బ్యూరో పని చేస్తోంది.
ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని నార్సింగి పోలీసులు ఏడు రోజుల కస్టడీకి కోరారు. కస్టడీ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు పాల్గొననున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.