Donald Trump latest :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఫ్లోరిడాలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి గురించి కీలక విషయాలు వెల్లుగులోకి వచ్చాయి. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాన్ వెస్లీ రౌత్ (58) దాదాపు 12 గంటలపాటు ఘటనాస్థలంలో తచ్చాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెస్లీ రౌత్ అరెస్టు చేసిన అధికారులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. సెల్‌ఫోన్ రికార్డుల ఆధారంగా అతడి కదలికల వివరాలను అధికారులు కోర్టు పత్రాల్లో ప్రస్తావించారు. రైఫిల్‌తోపాటు ఆహారం కూడా వెంట తెచ్చుకున్నాడని పేర్కొన్నారు.
వెస్లీ రౌత్‌పై భియోగాలు
వెస్లీ రౌత్‌పై ఫెడరల్ గన్ క్రైమ్స్‌కు సంబంధించి పలు అభియోగాలు మోపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడని, పైగా గతంలోనే దాని అనుమతి రద్దయిందని అధికారులు ఆరోపించారు. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతున్నందున అతడిపై మరిన్ని కేసులు మోపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు వెస్లీ రౌత్‌పై నేరాభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీని న్యాయవాదులు అభ్యర్థించారు.
ఎవరీ ర్యాన్ వెస్లీ?
ర్యాన్ వెస్లీ రౌత్ తన కుమారుడితోపాటు షెడ్లు నిర్మించే సంస్థను నిర్వహిస్తున్నాడు. 2018 వరకూ నార్త్ కరోలినాలో ఉన్న అతడు ఆ తర్వాత హవాయ్‌లోని కావాకు మకాం మార్చాడు. ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించే రౌత్, డెమోక్రటిక్ పార్టీ అభిమాని. ఉక్రెయిన్‌కు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటాడు.