తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు - నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం - US SHUTDOWN 2024

హమ్మయ్యా సేఫ్- అమెరికాకు తప్పిన షట్ డౌన్ గండం!

US Shutdown 2024
US White House (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 3 hours ago

US Shutdown 2024 :షట్‌డౌన్‌ గండం నుంచి అమెరికా బయటపడింది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనలను తొలగించి కొత్తగా ప్రవేశపెట్టిన కీలకనిధుల బిల్లును ప్రతినిధుల సభ, సెనెట్‌ ఆమోదించాయి. 2018-19లో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలకనిధుల బిల్లుకు ఆమోదం లభించక 35రోజులపాటు అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి.

ట్రంప్‌ డిమాండ్లతో నిలిచిపోయిన కీలకనిధుల బిల్లును అమెరికా ఉభయసభలు చివరిక్షణంలో ఆమోదించాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వరకు గడువు ఉండగా తొలుత స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లేవనెత్తిన డిమాండ్లను బిల్లు నుంచి తొలగించారు. అనంతరం ఆ బిల్లును సెనెట్‌కు పంపారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్‌డౌన్‌ ముప్పు తొలగిపోనుంది.

బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాల చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం బైడెన్‌ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ట్రంప్‌ దాన్ని తొలుత తిరస్కరించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చటంతో పాటు ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితి ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతినిధులసభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ బిల్లు ప్రవేశపెట్టగా సభ 235-174 ఓట్ల తేడాతో తిరస్కరించింది. 38మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు.

'అధికార మార్పిడికి అంతరాయం'
ఈ పరిణామాలపై శ్వేతసౌధం కీలక వ్యాఖ్యలు చేసింది. షట్‌డౌన్‌ వస్తే అధికార బదిలీకి అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత రావడం వల్ల ట్రంప్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో బిల్లులో మార్పులు చేశారు. ట్రంప్‌ డిమాండ్లను తొలగించి ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118పేజీల కొత్త బిల్లును స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టారు. 366-34తో ఓట్లతేడాతో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మెజారిటీ రిపబ్లికన్లు కొత్తబిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం సెనెట్‌కు పంపించారు. సెనెట్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉన్నందున అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడం లాంఛనంగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి లోపు ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించాల్సి ఉంది.

ట్రంప్ హయాంలో షట్​డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్​డౌన్ ముప్పు తప్పింది.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details