తెలంగాణ

telangana

ETV Bharat / health

మందు తాగేటప్పుడు, తాగిన తర్వాత - ​ఇవి తింటే​ మీ ఆరోగ్యం సేఫ్​గా ఉంటుందట​! - What Eat With Drinking Alcohol - WHAT EAT WITH DRINKING ALCOHOL

Best Foods to Eat Drinking With Alcohol : ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించినా.. దాన్ని తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, మందు తాగే సమయంలో, తాగిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి కొద్దిమేర మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Alcohol
Best Foods to Eat Drinking With Alcohol (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 3:13 PM IST

Foods to Eat Drinking With Alcohol :ఒకప్పటితో పోలిస్తే.. ప్రస్తుత కాలంలో మందు తాగేవారి సంఖ్య పెరిగింది. ఆనందంగా ఉన్నా లేదా బాధతో ఉన్నా కూడా చాలా మంది ఆల్కహాల్‌ తాగుతుంటారు. మెజార్టీ జనాలకు 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలుసు! కానీ, ఒక్కసారి మందుకు అలవాటైన తర్వాత క్రమంగా ఆ మత్తుకు బానిసలైపోతారు. మందు తాగడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాలహెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి. అయితే, కొంతలో కొంత మందు తాగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకునేందుకు తాగేటప్పుడు, తాగిన తర్వాత హెల్దీ ఫుడ్తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ.. ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

మందు తాగేటప్పుడు తినాల్సిన ఫుడ్స్​:

లీన్ ప్రొటీన్లు ఉండే ఫుడ్‌ :చికెన్‌, చేపలు, బీన్స్‌, చిక్కుళ్ల వంటి ఆహార పదార్థాలలో లీన్ ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల శరీరంలో నెమ్మదిగా ఆల్కహాల్‌ కలిసిపోతుందట. కాబట్టి, మందు తాగే సమయంలో ఇవి తింటే కొంత వరకు ఆల్కహాల్ గాఢతను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గర్భ నిరోధక మాత్రలు వాడితే ముప్పు - రీసెర్చ్​లో షాకింగ్ నిజాలు!

తృణధాన్యాలు :మద్యం సేవించే సమయంలో తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పిండి పదార్థాలు రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్‌ ఒకేసారి విడుదల కాకుండా అడ్డుకుంటాయి. దీనివల్లరక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి, హోల్‌ వీట్‌ బ్రెడ్‌, బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, వోట్స్ వంటి వాటిని తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ ఆహార పదార్థాలు ఆల్కహాల్ శోషణను నెమ్మదించేలా చేస్తాయని పేర్కొన్నారు.

నట్స్ :ఆల్కహాల్‌ తాగేటప్పుడు బాదం, జీడిపప్పులు, వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటివి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌లు ఆల్కహాల్‌ శోషణను మందగించేలా చేస్తాయని చెబుతున్నారు.

కోడిగుడ్లు :ఉడికబెట్టిన గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గుడ్లు జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని మందు తాగేటప్పుడు తినడం వల్ల ఆల్కహాల్​ను శరీరం తీసుకోవడం ఆలస్యం అవుతుందని నిపుణులంటున్నారు.

తాగిన తర్వాత ఇవి తినండి!

అవకాడో :మందు తాగిన తర్వాత ఒక అవకాడో పండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే.. ఈ పండులో ఉండే కొవ్వులు శరీరంలో ఆల్కహాల్‌ శోషించుకునే రేటును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెదడు ఆలోచన తీరు దెబ్బతినకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. 2003లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మందు తాగిన తర్వాత ఒక అవకాడో పండు తినడం వల్ల.. ఆల్కహాల్ రక్తప్రవాహంలోకి శోషించుకునే రేటు నెమ్మదిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్‌ జాన్ డి. గ్రోట్‌హౌస్' పాల్గొన్నారు.

పండ్లు, ఆకుకూరలు :మద్యం సేవించిన తర్వాత స్ట్రాబెర్రీలు, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే ఆకుకూరల భోజనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మద్యం తాగడం వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. ఈ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందుతుందని పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇయర్​ ఫోన్స్​ ముప్పు ​: ఫేమస్​ సింగర్​కే చెవులు దెబ్బతిన్నాయి! - ఇలా వాడితేనే మీరు సేఫ్!

అలర్ట్ : తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేస్తోందా? - దానికి అసలు కారణాలు ఇవే! - తగ్గించుకోకపోతే అంతే!

ABOUT THE AUTHOR

...view details