Avoid These Foods on Empty Stomach: పరగడుపున ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న విషయాలను పట్టించుకోకుండా కొంత మంది ఏదో ఒకటి తింటుంటారు. అయితే అలా తింటే అనవసరమైన అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు అవుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. పరగడుపున తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
సిట్రస్ పండ్లు:ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యేదై ఉండాలని నిపుణులు అంటున్నారు. అందువల్ల పొద్దున్నే తీసుకునే ఆహారంలో సిట్రస్ పండ్లు ఉండకూడదని అంటున్నారు. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమాటలు వంటి పుల్లని పండ్లను పరగడుపున తినకూడదని చెబుతున్నారు. పుల్లటి పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని.. కడుపులో అల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
పచ్చి కూరగాయలు:పరగడుపున ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది పచ్చి కూరగాయలు తింటుంటారు. అవి కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. పచ్చి కూరగాయల్లో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయం తింటే సరిగా జీర్ణం కాక ఇబ్బందులు వస్తాయని, పొత్తికడుపులో నొప్పి వస్తుందని చెబుతున్నారు.
తల్లిదండ్రులకు మూర్ఛ వ్యాధి ఉంటే పిల్లలకూ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే! - Epilepsy Causes
స్పైసీ ఫుడ్: చాలా మందికి పరగడుపున స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. అయితే స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో ఆహారం తొందరగా జీర్ణం కాదని.. అవి జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తాయని అంటున్నారు. అందుకే ఉదయాన్నే ఎట్టి పరిస్థితులలోనూ కారం కారంగాను, మసాలాలతోను వండినస్పైసీ ఫుడ్‌ను తినడం మంచిది కాదని చెబుతున్నారు.
డ్రింక్స్: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కారణం.. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ మధ్య చాలా సేపు మన పొట్ట ఖాళీగా ఉండడమే అంటున్నారు. ముఖ్యంగా.. నారింజ, నిమ్మరసం ఖాళీ కడుపుతో తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే జ్యూసులు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని.. తద్వారా నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
2017లో "ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగిన వ్యక్తులు మలబద్ధకం సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ పోషకాహార పరిశోధకుడు, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ జె. లీ పాల్గొన్నారు. పండ్ల రసాల్లోని చక్కెర, ఫైబర్ మలబద్ధకానికి కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు.