Varalaxmi Sarathkumar Nicholai Sachdev : నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో భర్తతో కలిసి పాల్గొన్నారు. తనను నటిగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు జ్వరం ఉన్నా తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌కు హాజరయ్యామని పేర్కొన్నారు.
"ఈ రోజు ప్లాన్ చేసిన ఈ వేడుకను రద్దు చేయాలని అనిపించలేదు. అందుకే జ్వరం ఉన్నా ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్ నాకు సెకండ్ హోమ్ టౌన్ లాంటిది. ఎందుకంటే అంతగా మీరు నాపై అభిమానం చూపించారు. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇకపైనా కూడా మీ ప్రేమ నాపై ఉంటుందని ఆశిస్తున్నాను. నా కెరీర్ ముగియలేదు. మళ్లీ ఇప్పుడే కొత్తగా మొదలైంది. నా భర్త ప్రోత్సాహంతో మరిన్ని చిత్రాల్లో నటిస్తాను" అని పేర్కొన్నారు.
సచ్‌దేవ్ మాట్లాడుతూ - "నా భార్య వరలక్ష్మి మీ అందరికీ బాగా పరిచయమే. అందం, టాలెంట్, యాక్టింగ్ విషయంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఎంతో ఉన్నతమైంది. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను" అని అన్నారు. ఇకపోతే ఇటీవల కోలీవుడ్ మీడియాతోనూ ఈ దంపతులు ప్రత్యేకంగా ముచ్చటించిన సంగతి తెలిసిందే.