ETV Bharat / technology

మీ కంప్యూటర్​/ ల్యాప్​టాప్​ను క్లీన్ చేయాలా? ఈ టాప్​-10 టిప్స్ మీ కోసమే! - HOW TO CLEAN YOUR PC SYSTEM

కంప్యూటర్​/ల్యాప్​టాప్​ పెర్ఫార్మెన్స్ బాగుండాలా? ఈ క్లీనింగ్ టిప్స్​ మీ కోసమే!

Gaming PC
Gaming PC (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 5:41 PM IST

How To Clean Your PC System : కంప్యూటర్లను, గేమింగ్ ల్యాప్​టాప్​లను తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.​ సిస్టమ్​పై దుమ్ము, ధూళి పేరుకుపోతే, అది వేడెక్కే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు చాలా కాలం పాటు దానిని శుభ్రం చేయకుండా వదిలేస్తే, దానిలోని పార్టులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా మీ పీసీ లేదా ల్యాప్​టాప్​ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. అందుకే మీరు తరచూ మీ కంప్యూటర్​ను శుభ్రం చేసుకోవాలి. కనీసం మూడు నెలలకు ఒకసారైనా దానిని క్లీన్ చేయాలి.

కంప్యూటర్​లను భౌతికంగా శుభ్రం చేసినంత మాత్రాన సరిపోదు. ఆపరేటింగ్​ సిస్టమ్​ను, సాఫ్ట్​వేర్లను కూడా అప్డేట్ చేస్తుండాలి. అలాగే పీసీలోని పాత ఫైల్స్​ను, అవసరంలేని అప్లికేషన్లను తొలగించాలి. అప్పుడే మీ పీసీ చక్కగా పనిచేస్తుంది.

How To Clean PC Physically :

  1. ముందుగా మీ కంప్యూటర్​ను టర్న్​ఆఫ్​ చేయాలి. తరువాత పవర్ కేబుల్​ను తీసేయాలి. లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ లాంటివి జరిగే ప్రమాదం ఉంటుంది.
  2. కంప్యూటర్​ను బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శుభ్రం చేయాలి. అలా కాకుండా మీరున్న గదిలోనే దానిని శుభ్రం చేశారనుకుందాం. అప్పుడు ఆ దుమ్ము, ధూళి అక్కడే ఉండి, మళ్లీ కంప్యూటర్​పైనే పడతాయి.
  3. సాధారణంగా పీసీ పైభాగంలో, కింది భాగంలో ఎక్కువగా దుమ్ము పేరుకుపోతుంది. కనుక మైక్రోఫైబర్ క్లాత్​తో శుభ్రంగా తుడవండి.
  4. వాస్తవానికి కంప్యూటర్ లోపల కూడా దుమ్ము, ధూళి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ప్యానెల్స్ ఓపెన్ చేసి,​ ఎయిర్​ కంప్రెషర్​తో వాటిని క్లీన్ చేయాలి. తరువాత పీసీ కేబుల్స్​ను, కంప్యూటర్​ ప్యానెల్​ను తిరిగి ఫిక్స్ చేయాలి.

How To Clean Your System

  1. కంప్యూటర్​ను బయట నుంచి శుభ్రం చేసినంత మాత్రాన మన పని అయిపోదు. సిస్టమ్​ లోపల కూడా ఎప్పడికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం మీకు అవసరంలేని ఫైల్స్​ను డిలీట్ చేయాలి. లేదా యూఎస్​బీ డ్రైవ్​లో లేదా క్లౌడ్​ స్టోరేజీలో వాటిని సేవ్ చేసుకోవాలి. అప్పుడే మీ పీసీలో చాలా స్పేస్​ ఫ్రీ అవుతుంది. కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది.
  2. చాలా పీసీల్లో ప్రీఇన్​స్టాల్డ్​ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి చాలా స్పేస్​ను ఆక్రమించుకుంటాయి. దీని వల్ల కంప్యూటర్ చాలా స్లోగా రన్ అవుతుంది. అందుకే అవసరంలేని యాప్​లను లేదా ప్రోగ్రామ్​లను వెంటనే అన్​ఇన్​స్టాల్ చేసేయండి.
  3. ఎప్పటికప్పుడు మీ బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచే, కుకీస్​ను డిలీట్ చేస్తుండాలి. లేకుంటే మీ సిస్టమ్​లో అనవసరమైన సమాచారం చాలా పేరుకుపోతుంది. మీ సిస్టమ్ స్లో అయిపోతుంది.
  4. సాధారణంగా మనకు అవసరంలేని ఫైల్స్​ 'ట్రాష్'లోకి పంపిస్తాం. కానీ ఆ ట్రాష్​లోని ఫైల్స్​ను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి. లేదంటే అది పీసీ పెర్ఫార్మెన్స్​ని దెబ్బతీస్తుంది.
  5. మీ పీసీ బాగా పనిచేయాలంటే, అప్పుడప్పుడు విండోస్​ను రీఇన్​స్టాల్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల సిస్టమ్​లోని మాల్​వేర్స్, సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్​ పోతాయి. అయితే రీఇన్​స్టాల్ చేసేముందు కచ్చితంగా మీ పర్సనల్ డేటాను బ్యాకప్ చేసుకోవాలి. లేదంటే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  6. నోట్​: కంప్యూటర్​పై దుమ్ము, ధూళి తొలగించడం సులువే. కానీ కంప్యూటర్​ లోపలి భాగాలను తుడిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు కంప్యూటర్​ను ఓపెన్ చేయడం రాకపోతే, రిస్క్ తీసుకోవడం కంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. ​

ల్యాప్​టాప్ బయ్యింగ్ టిప్స్ - గ్రాఫిక్స్ కార్డ్​ మస్టా? ఆన్​లైన్​ కొంటే బెటరా? లేదా ఆఫ్​లైన్​లోనా?

మీ కంప్యూటర్‌ స్లోగా రన్ అవుతోందా? డోంట్ వర్రీ - ఈ 10 టిప్స్‌తో PC స్పీడ్ పెరగడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.